Connect with us

నిజామాబాద్

గణేష్ మండలి నిర్వాహకులతో సమన్వయ సమావేశం 

Thammali Pandu

Published

on

గణేష్ మండలి నిర్వాహకులతో సమన్వయ సమావేశం 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గణేష్ మండలి నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఏసీపి ప్రకాష్ , 2 టౌన్ సీఐ శ్రీనివాస్ , ఎస్ఐ యాదగిరి, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, వివిధ గణేష్ మండలి నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గణేష్ మండలి నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని, పోలీసు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను, సూచనలను తప్పక పాటించాలని కోరారు.

పోలీసు అధికారులు కూడా ఉత్సవాల సమయంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ధ్వని వ్యవస్థల పరిమితులు మరియు ఇతర నిబంధనల గురించి మండలి నిర్వాహకులకు వివరించారు. అందరి సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా జరగాలని అభిప్రాయపడ్డారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading