జోగులంబ గద్వాల్
క్రీడా ప్రాంగణానికి స్థలం కరువు


జనం వెలుగు, మానోవపాడు:- మానోవపాడు మండలం జల్లాపురం గ్రామంలో క్రీడా ప్రాంగణానికి స్థలం కరువైంది. కొన్ని రోజుల క్రితం శవ సమాధుల మీద క్రీడా ప్రాంగణం బోర్డు ఏర్పాటు చేసి ఉన్నట్టుండి దాన్ని అక్కడి నుండి తొలగించి ప్రభుత్వ పాఠశాలలో బోర్డు పెట్టడంతో క్రీడా ప్రాంగణం స్థల కొరతగ మారింది. ఊరు ఊరంతా ఏకమై స్థల దాతలు ముందుకొస్తే తప్ప క్రీడా ప్రాంగణ ఏర్పాట అయ్యేలా లేదని, క్రీడా ప్రాంగణం ఉంటే నేటి యువతకు ఉత్తేజనికి అనువుగా ఉంటుందని కొందరు యువకుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుచేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని, సాయంత్రం పాఠశాల ముగియాగానే తాళాలు వేసి వెళ్తున్నారని, ఎప్పుడు ఆడుకోవాలని ప్రశ్నించారు. నామమాత్రంగా పనులు చేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.


కొందరు యువకులు క్రీడా ప్రాంగణమాన్ని ప్రభుత్వ పాఠశాలలో పెట్టించడాని గల కారణాలను పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా ఎం పి డి ఓ స్వయంగా వచ్చి పాఠశాలలో ఏర్పాటు చేయించాడని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపిందని అన్నారు.









