నిజామాబాద్
జాతీయ లోక్ అదాలత్ లో 6649 కేసులలో రాజీపడి పరిష్కారం


జాతీయ లోక్ అదాలత్ లో 6649 కేసులలో రాజీపడి పరిష్కారం
సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 24,02,552-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేత
జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను , సిబ్బందిని అభినందించిన నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య
జనంవెలుగు నిజామాబాద్ సెప్టెంబర్ 13 :- గత నెల రోజుల నుండి ఈ నెల 12 వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా , జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన , రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న
*ఐ.పి.సి & BNS & ఎస్.ఎల్.ఎల్ 462 కేసులు
*సైబర్ క్రైమ్ 71 కేసులు
*ఇ-పెట్టి 3109 కేసులు
*డి.డి & MV యాక్ట్ 3007 కేసులు
మొత్తం 6649 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిర్చడం జరిగింది.
పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లాకు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు , సైబర్ క్రైమ్ సిబ్బంది మరియు కోర్టు సిబ్బందిని ఆయన అభినందించారు.
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని , అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.
రాజీ మార్గమే రాజా మార్గం అని , రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు.
ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని , తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో D4C ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ నందు 71 సైబర్ క్రైమ్ కేసులలో 24,02,552-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందని చెప్పారు.
జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయాలన్నారు.
జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన సి.సి.ఆర్.బి , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య అభినందించారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








