నిజామాబాద్
వినాయక నిమజ్జనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు


వినాయక నిమజ్జనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ
ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
జనం వెలుగు నిజామాబాద్ :– ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య, ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ శనివారం గణేష్ శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని, నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి పరీవాహక ప్రాంతాన్ని, ఆర్మూర్ లోని గుండ్ల చెరువును కలెక్టర్, సీ.పీ నిశితంగా పరిశీలన జరిపారు.
అక్కడక్కడా గుంతలు పడిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి భిగించాలని సూచించారు.
జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా ఎనిమిది అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.
యంచ గోదావరి బ్రిడ్జి తో పాటు, ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్సు, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, నిజామాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే దుబ్బా ప్రాంతం నుండి వినాయకుల బావి వరకు గల ప్రాంతాలను సైతం కలెక్టర్, సీ.పీలు సందర్శించారు.
వినాయక బావి వద్ద సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏర్పాట్ల విషయమై కలెక్టర్, సీ.పీ సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
పోలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భారీ విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి ఉమ్మెడ గోదావరికి తరలించాలని సూచించారు.
ఈ మేరకు ఉమ్మెడ వద్ద కూడా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు.
కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, రవాణా, విద్యుత్, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు ఉన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








