Connect with us

నిజామాబాద్

పకడ్బందీగా, పారదర్శకంగా కొత్త పింఛన్ల ఎంపిక ప్రక్రియ.

Thammali Pandu

Published

on

పకడ్బందీగా, పారదర్శకంగా కొత్త పింఛన్ల ఎంపిక ప్రక్రియ.

రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలి

ఇందిరమ్మ ఇండ్ల L3 అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలి

జనం వెలుగు నిజామాబాద్ :- కొత్త పింఛన్ల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను సూచించారు. అర్హులైన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి మండలాల ఎంపీడీఓలతో సోమవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్త పింఛన్ల ఎంపిక, గృహనిర్మాణం, మండల పరిషత్ కార్యాలయాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.

కొత్త పింఛన్లకు సంబంధించి అర్హత కలిగిన వారిని క్షేత్రస్థాయిలో గుర్తించి ఎంపిక చేయాలని ఎమ్మెల్యే సూచించారు. లబ్ధిదారుల ధృవపత్రాలు, అర్హతలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, వెరిఫికేషన్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

 ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

అదేవిధంగా గృహనిర్మాణానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ పొరపాటున L3 జాబితాలో ఉన్న లబ్ధిదారులను గుర్తించి, నిబంధనల ప్రకారం L1 జాబితాలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు.

అర్హులైన పేదలకు గృహ నిర్మాణ ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల (MPDO) పరిస్థితిపైనా సమీక్షలో చర్చించారు. శిథిలావస్థలో ఉన్న కార్యాలయాలను గుర్తించి అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని, భవనాలు పూర్తిగా అనుకూలంగా లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రదేశాలకు కార్యాలయాలను మార్చే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజలకు, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading