నిజామాబాద్
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలో ఇండియా కూటమి మహాధర్నా


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలో ఇండియా కూటమి మహాధర్నా
మహాధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు భాగస్వాములు కావాలని పిలుపు
జనంవెలుగు నిజామాబాద్ :– దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల సంరక్షణ,SIR ను రద్దు చేసి, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదివారం సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఈ మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇండియా కూటమి నాయకులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ఆ హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
SIR పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని, ఓటు హక్కులకు విఘాతం కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిణామాలను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయాలని అర్హులైన ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో చేపడుతున్న ఈ మహాధర్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగిస్తున్న పోరాటంలో కీలకమైనదని భూపతి రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు,
మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఓటు హక్కును పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని ఆయన కోరారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








