నిజామాబాద్
నందిపేట మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను మంజూరు


ఆర్మూర్ ఎమ్మెల్యే కు ప్రజల కృతజ్ఞతలు
జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి ఫలితంగా సుమారు నాలుగు మండలాల 70 పరిసర గ్రామాల చిరకాల వాంఛ అయినటువంటి అగ్నిమాపక కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నందిపేట మండలంలో కేటాయించడం పట్ల నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ నందిపేట మండలంలో ఫైర్ స్టేషన్ లేక, నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి ఫైర్ ఇంజన్ రావాలంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రమైన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగేదని, కానీ నందిపేట మండల కేంద్రం సుమారు 70 గ్రామాలకు 15 నిమిషాల దూరంలో ఉంటుందని, దీనివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం తగ్గించవచ్చని, జీవో నెంబర్ 65 ద్వారా అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి పాలాభిషేకం చేసి, టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు మురళి, బజరంగ్, ఉప సర్పంచ్ భరత్, సీనియర్ నాయకులు సిలిండర్ లింగం, చెక్ చెక్ ముత్యం, రాజు గౌడ్, అహ్మద్ ఖాన్, లక్కంపల్లి చిన్నయ్య, దశ గౌడ్, మంద దేవన్న, డొంకేశ్వర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్, షాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, నడికుడ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్, కుద్వాన్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ చారి, వార్డు మెంబర్లు గంధం సాయిలు, రమేష్, రఫీక్, నాని, సలీం, యువ నాయకులు దుబాయ్ శీను, గాండ్ల సంతోష్, యాకూబ్ ఇమ్రాన్, దర్వాడి అశోక్, శేఖర్, విజయ్, దీపక్ , లక్ష్మణ్, తిరుపతి, సాయి, రోహిత్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








