Connect with us

ARTICLE'S

మూఢనమ్మకాల నిర్మూలన కోసం విద్యార్థి ,యువజనులు ఉద్యమించాలి

janamvelugunews

Published

on

ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు

 

 జనం వెలుగు:-  ఆదిమ మానవుడు ప్రకృతిశక్తులైన ఉరుములు, మెరుపులు, పిడుగులు, జడివానలు మొదలైనవి చేసే భీకరమైన నష్టాలను చూసి భయపడ్డాడు. వాటిని అర్థం చేసుకోలేని అజ్ఞానంవల్ల, ఈ ప్రపంచంలో తమకు తెలియని వేరే ఏదో ఒక బలమైన శక్తి ఉందని భావించాడు. ఆ బలమైన శక్తినే తర్వాతి కాలంలో దేవుడు అని నమ్మడం మొదలు పెట్టాడు. సమాజంలో వర్గాలు ఏర్పడే క్రమంలో పూజారివర్గం అనేది ఒకటి పుట్టుకువచ్చింది. తాము దైవదూతలమని, తాము చెప్పిందే వినాలని, దేవుడు, మతం మొదలైన విషయాలను తమ నియంత్రణకోసం పటిష్టం చేసి, ప్రజలను తమకు విధేయులుగా ఉండే ఏర్పాటు చేసుకున్నారు. అట్లా ప్రజలు, వారిని పరిపాలించేవారు అనే రెండు వర్గాలు తయారు అయ్యారని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజానేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు .

దేవుడి పేరుమీద కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఒక తత్త్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఆ తత్త్వశాస్త్రం ప్రజల్ని అజ్ఞానంలో ఉంచి, దోపిడీ చేసే ఒక నియంత్రణ సాధనంగా పూజారి వర్గానికి పనికి వచ్చింది. ఆదిమానవుడు తన అనుభవజ్ఞానంతో రూపొందించుకున్న సంస్కృతికి సంబంధించిన అనేక సదాచారాలను మతంలో విలీనం చేశారు. ఈ మతతత్త్వం అనేది ప్రకృతిలో సంభవించే ప్రతిమార్పుకు దైవాన్నే ఆధారంగా, మూలకారణంగా చూపింది. తద్వారా ప్రజల్ని దోపిడీ చేసే శక్తులకు ఆయుధంగా మారిందనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న విద్యార్థి, యువజనలకు రాసిన చైతన్య లేఖలో తెలిపారు .

రాజు దైవాంశ సంభూతుడని, వర్ణవ్యవస్థను దేవుడే ఏర్పర్చాడని, కష్టసుఖాలు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలని, సాంఘిక పరిస్థితులన్నింటికీ మతపరమైన కారణాలే చూపింది.

కాలం గడిచేకొద్దీ మొత్తం మానవ జీవన విధానం మీద మతం పట్టు సాధించింది. మతతత్త్వాన్ని బోధిస్తూ, దానిమీద ఆధారపడి పబ్బంగడుపుకున్న ప్రభువులు సాధారణ ప్రజలమీద ఆధిపత్యాన్ని, నియంత్రణను సాధించారు. రాజులు, మతబోధకులు కలిసి ప్రజల్ని పాలిస్తున్న పేరుమీద దోపిడీ చేశారనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు. కానీ మరోవైపు ఆదిమకాలం నుండి కూడా ప్రకృతిని, దానిలో సంభవించే మార్పుల్ని పరిమితమైన చైతన్యంలోంచే అయినా సరిగ్గా అర్థం చేసుకున్నవారు కూడా ఉన్నారనీ,. విశ్వానికి ఆవల అతీతశక్తులు, దేవుడు, దయ్యం అనేవేవీ లేవని, మతం అనేది ప్రజలను దోపిడీ చేయడం కోసం రూపొందించిన సాధనమని చార్వాకులు, లోకాయత్తులు మొదలైన తొట్టతొలి భౌతికవాదులు తేటతెల్లం చేశారనీ, అయితే వీరి సంఖ్య తక్కువగా ఉండడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే వైజ్ఞానిక శాస్త్రాలు లేకపోవడం, మనిషిలో సహజంగా ఉండే భయం అనేవి అన్నీ కలగలిసి మతవాదుల ఆధిపత్యాన్నే ముందువరుసలో నిలబెట్టాయనీ నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ స్వాప్నికుడు , అభ్యుదయ వాది, ప్రజానేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు .

మనుధర్మశాస్త్రం ‘శూద్రుణ్ణిగానీ, స్త్రీనిగానీ, నాస్తికున్నిగానీ చంపడం చాలా చిన్నపాపం’ అంటుంది. మతాన్ని స్థిరపర్చడం కోసం, బలపర్చడం కోసం, ప్రజల్ని మరింత కట్టుదిట్టంగా దోచుకోవడం కోసం రాసినటువంటి ఈమనుధర్మశాస్త్రం అనబడే మతతత్త్వశాస్త్రంలోని ఈ వాక్యం, మతం యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందనీ… బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత బ్రిటీష్ ఆంత్రోపాలజిస్ట్ చార్లెస్ ఫిలిప్ డార్విన్ రాసిన జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, ఈ భూమ్మీద మానవుడే మహాశక్తి సంపన్నుడు, ఆ మానవుడి చేతులు, చేపరెక్కల కంటే దృఢమైనవనీ, కళ్లు అనంత విశ్వాన్ని కూడా దర్శించగలవనీ, చెవులు ప్రపంచపు అవతల మాట్లాడే మాటల్ని కూడా వినగలవనీ,. పర్వతాల గుండా
సొరంగమార్గం కూడా వేసుకొని పోగలిగే శక్తి, ఎడారి భూముల్లోకి కూడా నీళ్లను మళ్లించగల శక్తి కేవలం మానవుడికీ మాత్రమే సొంతమనీ, కనుక ఆ మానవుడే తన సొంత శ్రమశక్తిద్వారా విజ్ఞాన శాస్త్రాలను రూపొందించాడనీ బోరన్నగారి ప్రజా చైతన్య గీతికలో ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

మానవుడు ప్రకృతిలోని ఏ విషయాన్నైనా విశ్లేషించగలిగే అనేక రకాల విజ్ఞాన శాస్త్రాలను రోజురోజుకు మరింత అభివద్ధి చేస్తున్నాడనీ,. ఒకప్పుడు భౌతికశాస్త్రం ఒక్కటే ఉండేది. ఇప్పుడు భూ భౌతికశాస్త్రం – ఖగోళశాస్త్రం కూడా ఉన్నాయి. పూర్వం రసాయన శాస్త్రం మాత్రమే ఉండేది. ఇప్పుడు భూ రసాయన శాస్త్రం, వ్యవసాయ రసాయన శాస్త్రం కూడా ఉన్నాయి. నూతన జ్ఞానం అభివృద్ధి అయ్యేకొద్దీ అనేకానేక శాస్త్రాలు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పోతున్నాయనీ విద్యార్థి, యువజనులకు బొరన్నగారు రాసిన చైతన్య గీతికలో ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

ఈ తరుణంలో ఒకవైపు గుండెను తీసి మళ్లీ అమర్చే శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటే… మూఢనమ్మకాలు, దేవుడు, దయ్యం, బాణామతి మంత్రాలు ఇలాంటివి ఇంకొకవైపు పెరిగిపోతున్నాయనీ, మనిషి సజీవ సమాధి అయితే మోక్షం లభిస్తుందని చావడానికి సైతం వెనుకాడని మౌఢ్యం కూడా వ్యాపిస్తున్నదనీ, సొంత పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని సైతం నరబలి ఇవ్వడానికి సిద్ధమౌతున్న అవాంఛనీయ వాతావరణం మన సమాజంలో చోటుచేసుకుంటున్నదనీ సామాజిక పరివర్తకుడు , ఏదో ఒక రోజు సాయూధ పోరాటం ద్వారానే ఈ దోపిడీ వ్యవస్థ మారుతుందనే ప్రగాఢ నమ్మకం ఉన్న నక్సల్బరి వర్గ పోరాట వాది, కమ్యూనిస్టు,విప్లవకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న తాజాగా విద్యార్థి, యువజన లోకానికి రాసిన చైతన్య గీతికలో పేర్కొన్నారు. మనిషి జీవితాన్ని మరింత అభివృద్ధి చేసి, ఉన్నత మార్గాలవైపు నడిపించడం కోసం ఒకవైపు విజ్ఞానశాస్త్రాలు కృషి చేస్తుంటే, మతవాదులు మాత్రం తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్లో మతాన్ని, మూఢనమ్మకాల్ని మరింత ప్రచారం చేస్తున్నారనీ,. దాని విషప్రభావం సమాజాన్ని మళ్లీ వెనక్కి తీసుకుపోతుందనీ ప్రజా బంధువు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటువంటి సామాజిక వాతావరణంలో హేతువాద, మానవతావాద దృక్పథాన్ని అధ్యయనం చేయాలని, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మార్క్సిస్ట్, లెనినిస్ట్ సాహిత్యాన్ని,కమ్యూనిస్టు ప్రణాళికను తప్పనిసరిగా చదవాలని, చదివిన ఒక్కరు, పదిమందికీ తెలియజేయడం బుద్ధిజీవులందరి బాధ్యతగా ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
హేతువాదమే మానవతావాదమనీ, మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయనటువంటి నూతన సమాజం కేవలం కమ్యూనిస్టు సమాజంతోనే నూతన సమ సమాజం నిర్మాణం జరుగుతుందని, అదే ప్రపంచ మానవాళికి అవసరమైన జీవగంజి అని తెలుపడం , తెలుసుకోవడం బుద్ధి జీవుల విద్యార్థుల యువజనుల సమాజ మార్పును కాంక్షించే ప్రగతిశీల వాదుల కర్తవ్యమని ప్రజా ఉద్యమకారుడు, సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజానేస్తం కామ్రేడ్ బొరన్నగారీ నేతాజీ సుభాషన్న …
98485 40078 …విద్యార్థి, యువజన లోకానికి రాసిన చైతన్య గీతికలో పేర్కొన్నారు.

“దేవుడిని తయారు చేసినవాడు స్వార్థపరుడని, శ్రమ చేయకుండానే ఇతరుల కాయకష్టమును ,శ్రమని దోచుకునే దొంగని, దేవుడి పేరును ప్రచారంచేసేవాడు ప్రజాధనంను దోచుకునే దొంగల ముఠా సభ్యుడని, దేవుడిని పూజించేవాడు అమాయకుడు, అజ్ఞానుడు, అనాగరికుడనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న విమర్శించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading