Sports
మళ్ళీ అదే తంతు.. ఇక బాసర IIIT తీరు మారదా..!!??


జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ గేటు ముట్టడి చేసిన బాసర మండల బిజెపి నాయకులు. నిన్న మధ్యాహ్నం యూనివర్సిటీ శక్తి మేస్ లో చికెన్ తో వడ్డించారు. అది తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై క్యాంపస్ లోని హాస్పిటల్ లో చేరారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న VC హుటాహుటిన అక్కడి వారి ఆరోగ్య పరిస్థితి లు అడిగి తెలుసుకున్నారు. కానీ IIIT వాట్సాప్ PRO మాత్రం జలుబు, దగ్గు వల్ల చేసారాని msg చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే కావాలనే యాజమాన్యం బయటకి ఈ విషయం పొక్కనివ్వడం లేదు అనే విమర్శలున్నాయి. ఈ విషయం తెలుసుకుని భోజనం చేసిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయం పై ఆగ్రహం చెందిన బిజెపి నాయకులు.ఈలాంటి ఘటనలు బాసర లో ఎందుకు జరుగుతున్నాయి అని గేటు ముందు బైఠాయించిన బిజెపి నాయకులు. యూనివర్సిటీ అధికారులు గేటు ముందు వచ్చి మాట్లాడే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఇందులో ఏది నిజం అనే కోణంలో ఆలోచన జరుపుతున్నారు సిబ్బంది.
Sports
ఇంగ్లాండ్ టార్గెట్ 399


ఇంగ్లాండ్ టార్గెట్ 399
జనంవెలుగు, క్రీడా విభాగం:- విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్(104)శతకంతో రాణించగా. అక్షర్(45), శ్రేయస్(29), అశ్విన్ (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. హార్ట్‌లీ 4, రెహాన్ 3, జేమ్స్ 2, షోయబ్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ టార్గెట్ 399. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేయగా. ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌటైంది.
Education
బంగారు పతకం సాధించిన అల్ఫోర్స్, ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి


బంగారు పతకం సాధించిన అల్ఫోర్స్, ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి
జనం వెలుగు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అనిల్ గంటడి:- విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పాల్గొనేలా ప్రోత్సాహకాలను అందించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి స్థానిక ఆదర్శనగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థిని జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకం సాధించడంపట్ల ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలలో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉంటాయని ప్రత్యేకంగా విజయాలను సాధించే విధానాలను తెలుసుకుంటామని చెప్పారు. క్రీడల్లో లభించే లాభాలు మరే ఇతర అంశాల్లో సాధ్యం కాదని చెప్పారు. క్రీడల ద్వారా కలిగే విశిష్ట లాభాలవలన పాఠశాల విద్యా ప్రణాళికలో భాగంగా విద్యార్థులను వివిధ పోటలకు ఎంపిక చేయడమే కాకుండా అందులో విజయాన్ని సునాయాసంగా అందుకోవడానికై ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని అందులో ప్రతిభను కనబరచిన వారికి పోటీలకు ఎంపిక చేస్తామని వారు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో మంచిర్యాల్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి పి.యస్. ఆర్ మొదటి జాతీయ ఓపన్ ఆల్ స్టైల్స్ కరాటే చాంపియన్షిప్-2024 కటా విభాగంలో పాఠశాలకు చెందినటువంటి కాపం సమన్యు, వైట్ బెల్ట్ తో పాటు బంగారు పతాకాన్ని సాధించాడని హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకం సాధించడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజేతకు పుష్పగుచ్ఛంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Sports
ముగిసిన ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నీ


ముగిసిన ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నీ
జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 33 వ, మల్లెపూల నరేంద్ర మెమోరియల్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని ఆంజనేయులు జట్టు కైవసం చేసుకుంది. 2 రోజులుగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో ఆంజనేయులు జట్టు విజేతగా నిలిచింది.
















