నిర్మల్
బాసర త్రిబుల్ ఐటీలో హై ఎనర్జీ డెన్సిటీ మెటీరియల్‌ల సంశ్లేషణపై ఉపన్యాసం


జనం వెలుగు:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విద్యలయం బాసర త్రిబుల్ ఐటీ లో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ఫైన్-ట్యూన్ చేయబడిన లక్షణాలతో కొత్త గ్రీన్ హై ఎనర్జీ డెన్సిటీ మెటీరియల్‌ల సంశ్లేషణపై ఉపన్యాసాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వక్తగా డా. ధరావత్ శ్రీనివాస్ ఐఐటీ-కాన్పూర్ గారు ఉపన్యాసం ఇవ్వగా రసాయన శాస్త్రం మరియు రక్షణ రంగాలలో దాని అప్లికేషన్ల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రసాయన శాస్త్రంలో అద్భుతాలు సృష్టించవచ్చని, ప్రస్తుతం రసాయనిక చర్యలు చేపట్టి సమాజంలో అక్కరకు వచ్చే అనేక సాధనాలు, పద్ధతులను వివరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొ సతీష్ కుమార్ మాట్లాడుతూ రసాయన శాస్త్రం మరియు ఇంజనీరింగ్ విద్య మిళితంతో అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్, డాక్టర్. ఎన్. రాకేష్, హెచ్ ఓ డి కెమిస్ట్రీ డాక్టర్. సి శోభాదేవి, సమన్వయకర్త డాక్టర్. S. విట్టల్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్. జె. కాశన్న, ఎం. శ్రీకాంత్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు
నిర్మల్
రహదారులే కల్లాలు!


రహదారులే కల్లాలు!
రైతులకు కల్లాల కొరత.. రోడ్లపైనే ధాన్యం మొక్కజొన్న ఆరబోత!
ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ప్రధాన రహదారులు
కనిపించని కల్లాలు.. ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు!
అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం
జనం వెలుగు, లోకేశ్వరం: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను ఆరబెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు అవసరమైన కల్లాలు, ప్రత్యేక వేదికలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. దీంతో రహదారులు ధాన్యం కల్లాలుగా మారిపోతుండగా, వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
పంట పండించడం ఒక ఎత్తు.. ఆరబెట్టడం మరో ఎత్తు!
రైతులు కష్టపడి పంటలు పండించినప్పటికీ, వాటిని ఆరబెట్టుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ రైతులకు అవసరమైన కల్లాల ఏర్పాటుపై తగిన దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరి కోతలు ప్రారంభం కాగానే గ్రామీణ రహదారులపై ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పలు ప్రధాన రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అనువైన వేదికలు లేకపోవడంతోనే రోడ్లను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పంటను ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో జాప్యం జరుగుతుండటంతో ధాన్యాన్ని రోడ్లపైనే కుప్పలుగా పోసి, వాటిపై తాటిపత్రాలు కప్పి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
రహదారులపై మృత్యుపాశం!
రహదారులపై ధాన్యం కుప్పలు ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ధాన్యం కుప్పలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వడానికి ప్రయత్నించే క్రమంలోనూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతుల జీవనాధారమైన పంటలు రహదారులపై ఆరబెట్టడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా పంటల సీజన్లో ఇదే సమస్య పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలున్నా.. తరలింపులో జాప్యం!
ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, రవాణా వాహనాలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం తరలింపు నెమ్మదిగా సాగుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ధాన్యాన్ని రోడ్లపైనే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఒకవైపు కల్లాల కొరత, మరోవైపు ధాన్యం తరలింపులో జాప్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్య కారణంగా రహదారులపై ప్రయాణించే ప్రజలు కూడా ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సి వస్తోంది.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!
రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు, సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు, రోడ్లు–భవనాల శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రైతులకు కల్లాలు నిర్మించడంతో పాటు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి పంట ఉత్పత్తులను సకాలంలో తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి!
రైతులకు అవసరమైన కల్లాలు నిర్మించే వరకు రహదారులపై ధాన్యం కుప్పలు ఉన్న ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు కలిగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రివేళల్లో వాహనదారులకు ధాన్యం కుప్పలు స్పష్టంగా కనిపించేలా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అదే సమయంలో, రహదారులపై పంట ఉత్పత్తులను ఆరబెట్టడం వల్ల కలిగే ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నారు.
రైతులకు కల్లాలు.. ప్రజలకు భద్రత కల్పించాలి!
రైతులు పండించిన పంటను భద్రపరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కూడా అత్యంత కీలకం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, గ్రామాల్లో అవసరమైన కల్లాలను నిర్మించడంతో పాటు ధాన్యం కొనుగోలు, రవాణా సమస్యలను పరిష్కరించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. రైతుల కష్టానికి పరిష్కారం చూపాలి.. రహదారులపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి..ప్రజల ప్రాణాలను కాపాడాలి
నిర్మల్
కనకాపూర్ లో స్మార్ట్ రేషన్ కార్డులు,చెత్త బుట్టల పంపిణీ


కనకాపూర్ లో స్మార్ట్ రేషన్ కార్డులు,చెత్త బుట్టల పంపిణీ
జనంవెలుగు, లోకేశ్వరం:- మండలంలోని కనకాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు, చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షిండే సునీల్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రతను కాపాడుకోవడంతో పాటు, ప్రతి కుటుంబం చెత్తను చెత్త బుట్టల్లోనే వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగుబాయి గంగన్న, పంచాయతీ కార్యదర్శి రాజు, రేషన్ డీలర్ దేబ్బడి దేవేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
రాజుర గ్రామానికి చెందిన సాయన్నకు కాంగ్రెస్‌లో కీలక బాధ్యత


రాజుర గ్రామానికి చెందిన సాయన్నకు కాంగ్రెస్‌లో కీలక బాధ్యత
జనంవెలుగు, లోకేశ్వరం: మండలంలోని రాజుర గ్రామానికి చెందిన సాయన్నను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సాయన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నియామకంపై మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సాయన్నకు అభినందనలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్సీ సెల్ నాయకత్వానికి సాయన్న కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.








