Education
10 లో 11 కాదు 6 మాత్రమే


పదవతరగతి పరీక్షల్లో 6 సబ్జెక్టులే ఉండనున్నాయి
జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి తెలంగాణ వచ్చాక కూడా పదవతరగతి లో 6 సబ్జెక్టు లే ఉండేవి. కానీ ఆ తర్వాత 11 సబ్జెక్టులుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మళ్ళీ ఇప్పుడు రానున్న ఈ 10వ తరగతి పరీక్షలు 6 సబ్జెక్టులుగా చేసి నిర్వహించనున్నట్టు తెలిసింది. అయితే ప్రతీ సబ్జెక్టు ఒక్కరోజే అయితే సైన్స్ లో మాత్రం రెండు పేపర్లు గా పరిగణించి ఫిజికల్ సైన్స్-1 బయోలాజి-2 లాగా ఒకేరోజు చెరో పేపర్ కి 40 మార్కులుగా నిర్ణయించారు. ఎలాగూ మరో 20 మార్కుల ఆబ్జేక్టీవ్ గా పేపర్ గా ప్రతీ పేపర్ కి నిర్ణయించి అటు 80 ఇటు 20 మొత్తం కలిపి 6 సబ్జెక్టు లకి 600 మార్కులతో ఈ పరీక్షలు ఉండనున్నాయి.
Education
నందిపేట మండల కేంద్రంలో సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా…..


నందిపేట మండల కేంద్రంలో సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా…..
నందిపేట్ ఆగస్టు 17 జనం వెలుగు న్యూస్ : సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో స్థానిక ప్రభుత్వ సాంకేతిక కళాశాల విద్యార్థులు వుయ్ వాంట్ జస్టిస్, శక్తి స్కీం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులంతా రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల ధర్నాకు నందిపేట మండల బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ…. ప్రభుత్వం దుర్మార్గంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, ఐటిఐ విద్యార్థులతో సమానంగా పరిగణించే విధంగా శక్తి పథకం పేరుతో ప్రయోగాలు చేయడం సమంజసం కాదని సాంకేతిక విద్యార్థులు మూడు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉత్తమ విద్యను అభ్యసిస్తామని
ఈ శక్తి పథకం ద్వారా బీటెక్ వెళ్లేందుకు అడ్డంకులు ఎదురవుతాయని, సాధారణ విద్యార్థుల లాగే మేము కూడా బీటెక్ ప్రవేశ పరీక్షలను రాయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ఈ యొక్క స్కీంను ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
















