నిర్మల్
విద్యాశాఖ మంత్రిని కలిసిన త్రిబుల్ ఐటీ వీసీ


జనం వెలుగు బాసర:- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిన్ని కలిసినా ఆర్జీయూకేటీకి వైస్ ఛాన్స్లర్ బడ్జెట్‌లో 53 కోట్లు కేటాయించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మరియు విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి కరుణను అభ్యర్థించారు, దీని కోసం మరింత బడ్జెట్‌ను కేటాయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళతామని మంత్రి హామీ ఇచ్చారు. యూనివర్శిటీకి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కాన్వొకేషన్‌ను ఘనంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధ్యాపకులు మరియు సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. అలాగే ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని, అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ విద్యా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు తోడ్పాటు అందిస్తున్నారని వీసీ ప్రొపెసర్ వెంకటరమణ వివరించారు. విద్యార్థులకు క్షేత్ర పర్యటనలకు సందర్శించేందుకు ప్రొత్సహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్జీయూకేటీ వీసీ గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో ఆర్జీయూకేటీ బాసరకు 20 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ తో పాటు నిర్వహణ పద్దు కింద దాదాపు 33.11 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసరను జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థగా తీర్చిదిదెందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మునుముందు చేపడతామని తెలిపారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








