Connect with us

నిర్మల్

బాసరలో ముగిసిన క్రికెట్ పోటీలు

INTHIYAZ MIRZA

Published

on

క్రీడలతోనే మానసిక ఉల్లాసం
బాసర ప్రెస్ క్లబ్ పై పోలీస్ టీం ఘన విజయం

జనం వెలుగు, బాసర:- క్రీడలతోనే మానసిక ఉల్లాసం కల్గుతుందని భైంసా ఏ ఎస్ పి కాంతిలాల్ పటేల్ తెలిపారు. మీడియా క్రికెట్ లెగ్ బాసర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారి ఆధ్వర్యంలో గత నాల్గు రోజుల నుండి జరుగుతున్న రెవిన్యూ  అగ్రికల్చర్ పొలిటికల్ బాసర ప్రెస్ క్లబ్ 6 టీంలు పాల్గొనగా సెమి ఫైనల్లో అగ్రికల్చర్ జట్టుపై పోలీస్ స్టేషన్ విజయం సాధించి ఫైనల్ లో బాసర ప్రెస్ క్లబ్ పై పోలీస్ స్టేషన్ శనివారం మనవిజం సాధించింది మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బిల్డింగ్ ఎంచుకోగా బాసర టీం 85 రౌండ్లకి కుప్పకూలింది దీంతో పోలీస్ టీం రెండో దిశలో బ్యాటింగ్ కూ దిగగా 10 ఓవర్ లోనే నాలుగు వికెట్లు కోల్పోయి అలవోకగా ఆడుతూ పాడుతూ 92 పరుగులు  చేసి విజయాన్ని సాధించారు. అనంతరం భైంసా ఎస్పి కాంతిలాల్ పటేల్ మాట్లాడుతూ ప్రతి యువకుడు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని క్రికెట్ నే కాకుండా అనేక క్రీడలు ఉన్నాయని వాటిని ఆస్వాదించడం మన బాధ్యత అని క్రీడలు ఆడితే మానసికంగా దృఢత్వంగా ఉల్లాసంగా ఉంటారని క్రికెట్ అంటే చాలా ఇష్టమని తెలిపారు రున్నేర్ ఆఫ్ గా నిలిచిన బాసర ప్రెస్ క్లబ్ జట్టును కెప్టెన్ బత్తిరి ప్రసాద్ ను భైంసా ఏ ఎస్ పి కాంతిలాల్ పటేల్ కప్పును అందజేయగా విన్నర్ గా నిలిచిన పోలీస్ టీంకు బాసర మండల సర్పంచ్ సుధాకర్ రెడ్డి పోలీస్ టీం కెప్టెన్ ముధోల్ సిఐ వినోద్ కుమార్ రెడ్డి కు కప్పును అందజేశరు. చేశారు హోరాహోరి పోరులో ఫైనల్ మ్యాచ్లో భైంసా ఏ ఎస్ పి కాంతిలాల్ పటేల్ 2 ఓర్లేసి నాలుగు వికెట్లు తీసుకొని మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. దీనితో పలువురు ఎస్పీకి అభినందించారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ శ్రీ జ్ఞాన సరస్వతి మైదానంలో జరుగుతున్న నాలుగు రోజులపాటు క్రికెట్ పోటీలు చాలా సంతోషంగా ఆస్వాదించామని గ్రామస్తులు క్రికెట్ అభిమానులు తెలిపారు. ఈ మ్యాచ్లో ఎంపైర్లు సునీల్ శాస్త్రి పింటూ దేశాయ్ వ్యాఖ్యాతగా గౌతం మేనేజ్మెంట్లుగా బత్తీర ప్రసాద్ విజయ్ కుమార్ నాగేశ్వరరావు దత్తు పటేల్ వ్యవహరించగా. ఈ క్రికెట్ టోర్నమెంట్ కి దాతలుగా మొదటి బహుమతి సంతోష్ కుమార్ వ్యాసపురి కన్యక పరమేశ్వరి ట్రస్ట్ ఇంచార్జ్ రెండో బహుమతిగా తీగల వెంకటేష్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నారాయణరావు పటేల్ సుధాకర్ రెడ్డి జగన్ బాసర సర్పంచ్ లక్ష్మణరావు జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్ సీనియర్ పాత్రికేయులు కొండూరి ప్రతాప్ రావు డాక్టర్ సంతోష్ తమ వంతు సహాయంగా నిలిచారు. అనంతరం ఈ క్రికెట్ టోర్నమెంట్లో తమ వంతు సహాయంగా ఆలయ సిబ్బంది హుడా సిబ్బంది ఎంతో సహాయ సహకారాన్ని అందజేశారని కోరుకుంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు గ్రామస్తులు ఇతర గ్రామాల నుండి ఆసక్తిగా చూడటానికి భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading