నిర్మల్
బాసర త్రిబుల్ ఐటీ లో ఘనంగా ముగిసిన ఎఫ్ డి పి


జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు నుండి జరుగుతున్న టిడిపి కార్యక్రమం ఘనంగా శుక్రవారం ఘనంగా ముగిసింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ & అడిటీవ్ మ్యానీఫ్యాచరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన త్రీడి ప్రింటింగ్ మరియు డిజైన్ పై ఒక వారం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 35 ముంది పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.త్రీడి ప్రింటింగ్ మరియు డిజైన్ పై 13 మంది వివిధ రంగాలలో నిష్ణాతులు మాట్లాడారు. మొదటి రోజు సోమవారం ప్రోటోటైప్‌లు టు ప్రొడక్ట్: టెక్నాలజీస్ అండ్ కేస్ స్టడీస్ అనే అంశం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. శ్రీరాం వెంకటేష్ బోధించారు తదనంతరం ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ & సస్టేనబిలిటీ యాస్పెక్ట్స్ ఆఫ్ త్రీడీ ప్రింటింగ్ అంశం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎల్. శివరామకృష్ణ ఉపన్యాసం అందించారు. రెండవ రోజు మంగళవారం మోడలింగ్ స్కెచింగ్-పార్ట్ డ్రాయింగ్ అంశం ఐఐఐటి బాసర అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.చరణ్ రెడ్డి మాట్లాడారు. మోడలింగ్ – అసెంబ్లీ ఆఫ్ ది పార్ట్స్ అంశం ఐఐఐటి బాసర అసిస్టెంట్ ప్రొఫెసర్ & మెకానికల్ విభాగాధిపతి రాహుల్ ఉపన్యసించారు. ప్రాక్టిస్ సెషన్ ఆన్ మోడలింగ్ & స్లైసింగ్ అంశం ఐఐఐటి బాసర అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమ్.నరేందర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డా.పి.వి.చంద్రశేఖర రావు మాట్లాడారు. మూడవ రోజు బుధవారం పోస్ట్ ఫినీషింగ్ ఆఫ్ త్రీడీ ప్రింటెడ్ కాంప్లెక్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంశం ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ డా.మామిళ్ళ రవిశంకర్ మాట్లాడారు.డెమో ఆఫ్ పాలీజెట్, ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఎమ్ ,ఏఎమ్ టెక్నాలజీస్ అంశం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ మాట్లాడారు. డెమో ఆఫ్ ఎఫ్డీఎమ్, ఎస్ఎల్ఏ-డిఎల్‌పీ త్రీడీ స్కానర్ అంశం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎల్ శివరామకృష్ణ మాట్లాడారు. నాల్గవ రోజు గురువారం డిజైన్ ఫర్ అడీటీవ్ మ్యానీఫ్యాచరింగ్ అంశం ఐ.ఎఫ్.హెచ్.ఇ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా.మన్మధ చారి మాట్లాడారు. మెటీరియల్స్ ఫర్ అడీటీవ్ మ్యానీఫ్యాచరింగ్ అంశం హైదరాబాద్ ఎన్.సి.ఏ.ఎమ్ సభ్యులు కే.రాకేష్ మాట్లాడారు. మెటర్ త్రీడీ ప్రింటింగ్ ఫర్ డిఫెన్స్ అప్లికేషన్స్ అంశం డిఎమ్ఎల్ఆర్ సైంటిస్ట్ ఎస్.రమేష్ కుమార్ మాట్లాడారు. చివరి రోజు శుక్రవారం త్రీడీ ప్రింటింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్-హైప్ & రియాలిటీ అంశం హైదరాబాద్ సన్‌షైన్ హాస్పిటల్స్ డిఎన్బి డైరెక్టర్ ప్రొ.ఎమ్.వి.రెడ్డి మాట్లాడారు. అప్లికేషన్ ఆఫ్ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్ ఫేషియల్ రికన్స్ట్రక్షన్ అంశం ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ & డెంటల్ సైన్సెస్ డా.అబినంద పోత్తూరి మాట్లాడారు. త్రీడి ప్రింటింగ్ డిజైన్ పై ఒక వారం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం దిగ్విజయంగా శుక్రవారం ముగిసిందని వీసి ప్రొ.వి.వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వార బోధన మూల్యాంకన పద్ధతుల్లో కొత్త భావనల గురించి అధ్యాపకులకు అవగాహన కల్పించడం, సమర్థ సమర్థవంతమైన అధ్యాపకుడుగా, నిర్వాహకుడుగా, పరిశోధకుడుగా, గురువు పాత్రను నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం మరియు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగ పడుతుంది.
కమ్యూనికేషన్, నీతి మరియు ప్రవర్తనా నైపుణ్యాలలో నైపుణ్యాన్ని పొందేందుకు అధ్యాపకులకు సహాయం చేయడం,
ఆధునిక సమాచారం మరియు పరిశోధనా పద్దతి సాధనాలను ఉపయోగించి జ్ఞానాన్ని పొందవచ్చని తెలిపారు. డైరెక్టర్ ప్రొ.పి.సతీష్ కుమార్ ఎఫ్డీపి దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంగా మెకానికల్ విభాగ అధ్యాపకులను అభినందనందించారు. పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా అధ్యాపకులకు ప్రోత్సాహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








