World
మళ్లీ బ్రిటన్ ప్రధాని పీఠంపై ఆ నేత కన్నేశారా?


బ్రిటన్ ప్రధానమంత్రి లిస్ట్రస్ రాజీనామాతో కొత్త ప్రధానమంత్రి కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. కాగా లిస్ ట్రస్తో చివరి వరకు ప్రధానమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ భారత సంతతి నేత రిషి సునాక్ చివరి క్షణంలో వెనుకుబడి ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిస్ ట్రస్ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక పేదలకు సంపన్నులకు ఒకే విధమైన పన్ను విధింపులు రాయితీలు ఇచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా ఎన్నికైన 45 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడానికి మార్గం సుగమమైనట్టేనని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు బదులుగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తాను పోటీ చేస్తానని.. రిషి సునాక్ను ఆగిపోమ్మని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
కాగా ఈసారి ప్రధానమంత్రిని ఎంపిక ప్రక్రియ ఇంతకుముందులా రెండు నెలలు పట్టదని చెబుతున్నారు. వారం లోనే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.
కొద్ది నెలల కిందట బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తరవాత కొత్త ప్రధానిని ఎన్నుకునే తతంగం రెండు నెలలపాటు సాగిన సంగతి తెలిసిందే.
కాగా అక్టోబర్ 21న ప్రధాని పదవికి నామినేషన్లు స్వీకరణ మొదలైంది. 650 సీట్లు గల బ్రిటిష్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికీ తద్వారా ప్రధానమంత్రి పదవికీ పోటీ పడే అవకాశముంది.
ఇంతకుముందు నామినేషన్ వేయడానికి 20 మంది ఎంపీల మద్దతు ఉంటే సరిపోయేది. ఈసారి కనీసం 100 మంది కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులని వెల్లడించారు. దీంతో ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీ సారథ్యానికి పోటీ పడటానికి అవకాశముంది. కాగా అక్టోబరు 24 మధ్యాహ్నం 2 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల లోపల పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు.
అక్టోబర్ 24న ముగ్గురు అభ్యర్థులలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటారు.
ఇక పోటీలో మిగిలిన ఇద్దరికి ఎంపీలు సూచనాత్మక ఓట్లు వేస్తారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 172000 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ప్రధానిని ఎంచుకుంటారు. అక్టోబర్ 28న విజేతను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికైనవారిని కొత్త ప్రధానమంత్రిగా బ్రిటిష్ రాజు ప్రకటిస్తారు.
ప్రధాని పదవి కోసం ఇటీవల ట్రస్తో పోటీపడి ఓడిపోయిన మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్ కొత్త ప్రధానిగా ఎన్నికవుతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో ట్రస్ సునాక్లతో నాయకత్వం కోసం పోటీ పడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈసారి తాను పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. రక్షణ మంత్రి బెన్ వాలెస్ కూడా తాను పోటీలో ఉండబోనని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఎంపీల మద్దతు రిషి సునాక్కే ఎక్కువగా లభించొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకునేవారూ ఎక్కువగానే ఉన్నారు. బోరిస్కు మద్దతివ్వాలంటూ ప్రచారం ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. అయితే రిషి సునాక్తో పోలిస్తే బోరిస్ జాన్సన్కు అంత క్రేజ్ లేదని అంటున్నారు.


World
వరద బాధితులకు మేము సైతం


వరద బాధితులకు మేము సైతం
తెలుగు జర్నలిస్టుల సంక్షేమసంగం
జనం వెలుగు, వెబ్ డెస్క్:- గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్నిఅతలా కుతలం చేసిన అతి పెద్ద వరదల్లో విజయవాడ వరద కూడా వచ్చి చేరింది.లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి.మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వాయనాడ్ బీభాత్సవం తెలియజేస్తే లేటెస్ట్ గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రాశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిస్సహాయులకు మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ముడు రోజులుగా,వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులు సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు. అటు జర్నలిస్ట్ ల కైనా ఇటు సామాన్య ప్రజలకైనా ఆపద వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుండే యూనియన్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంగం.. వరదల్లో చిక్కుకున్న బాధితులకు 5000వేల పులిహార ప్యాకెట్లు, మంచి నీళ్ళ బాటిల్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వరద నీటితో అంటురోగాలు, వ్యాధులు ప్రబలకుండా బాధితులకు హోమియోపతి రోగనిరోధక శక్తి బిళ్ళలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు జర్నలిస్టులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
World
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా


ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా
జనంవెలుగు, హైదరాబాద్:- దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం. కీలక తీర్పు వెలువ రించింది. వర్గీకరణ సమర్థ నీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది.2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిం చింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పంజాబ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం జస్టిస్ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. ఆ తీర్పును పున:సమీక్షిం చాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.
World
ఆ పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం


ఆ పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం
సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి మన మంగళ్ పాండే
-నేడు ఆయన జయంతి
జనంవెలుగు, విశ్లేషణ:- భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. అతడి పేరు వింటేనే బ్రిటిష్ వారి గుండెలో చలిజ్వరం పుట్టించిన భారతదేశ సింహస్వప్నం. బహుశా ఈ తరం యువకులకు మంగల్ పాండే గురించి అంతగా తెలువకపోవచ్చు కానీ దేశ మొదటి స్వతంత్య్ర సంగ్రామంలో బొబ్బిలి పులిల పోరాడిన ధీరుడు. మంగల్ పాండే 19 జులై 1827న ఉత్తరప్ర దేశ్‌లోని నగ్వ గ్రామంలో దివాకర్, అభైరని పాండే లకు జన్మించాడు. 1857- 58 మధ్య కాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రా మంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలులు, పీష్వాల పట్ల నిర్లక్ష్య వైఖరి లాంటి రాజకీయ కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. డౌహల్సి ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం లాంటివి ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఈనేపథ్యంలో బ్రిటిష్ వారు సిపాయిలను ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా 1857 మార్చ్ నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన సైనికుడు మంగల్ పాండే బ్రిటిష్ సార్జెంట్ మీద దాడిచేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. దానికి సార్జెంట్.. మంగల్ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి పాండేను బంధించాలని జమిందార్‌ను ఆజ్ఞాపించాడు. అతను కూడా జమిం దార్ ఆజ్ఞను తిరస్కరించాడం ద్వారా సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. దీంతో మంగల్ పాండేను, జమిందార్‌ను బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకొని ఏప్రిల్ 7న ఉరితీసింది. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్ లాంటి ధీరులు కూడా స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గౌరవార్ధం అప్పటి ప్రభుత్వం 1984లో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
















