నిర్మల్
సమస్యలను ఎదుర్కొంటేనే విజయం వారి సొంతం


జీవితంలో సమస్యలను ఎదుర్కొంటేనే విజయం వారి సొంతం
జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీలో సోమవారం. దైనందిన జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ సాధ్యమవుతుందని ప్రముఖ ఇంగ్లీష్ ట్రైనర్, కౌన్సిలర్, కోచ్ రాఘవేంద్ర ఆర్జీయూకేటీ బాసరలో ఏర్పాటు చేసిన విద్యార్థులు కెరీర్ తో పాటు ఇంటర్వ్యూను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలీ, ఎలా విజయం సాధించాలలి అనే అంశంపై శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విశిష్ట ఉపన్యాస ప్రతిపాదనను అంగీకరించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట రమణకి, డైరెక్టర్, ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేసారు. డయల్ యువర్ విలేజ్ సంస్థ ద్వారా ఆర్జీయూకేటీ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ లో భాగంగా ఎటువంటి అవకాశాలు ఉంటాయి వాటిని ఏ విధమైన సవాళ్లు ఉంటాయి? ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై రాఘవేంద్ర గారు సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు. ఇంటర్వ్యూలో వెళకువలు, ఉపాధి అవకాశాలు, ప్రస్తుతం ఉన్న కోర్సులు వాటి ప్రాధాన్యతలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. లక్ష్యాలు, ఆశయాలను ఏర్పరచుకోవడానికి అందుబాటులో ఉన్న సమయానికి తనను తాను ఎలా సిద్ధం చేసుకోవాలి? నిర్దేశించబడిన లక్ష్యాల కోసం సరైన మార్గాలను ఎలా అన్వేషించాలి, ప్లాన్ Bని ఎల్లప్పుడూ ప్లాన్ Aతో ఉంచడం గురించి మాట్లాడారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సానుకూల దృక్పథం, వ్యాపారం & కార్పొరేట్ మర్యాదలు, మిర్రర్ టెక్నిక్‌ని ఉపయోగించి కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ఎలా పెంచుకోవాలో అనేక చిట్కాలు విద్యార్థులతో పంచారు. మాతృభాష ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేక చిట్కాలను కూడా ప్రవేశపెట్టారు, ప్రతిరోజూ 5 పదాలు నేర్చుకుంటామని మరియు వాటిని మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తామని వాగ్దానం చేసారు. విద్యార్థులందరూ ఈ చిట్కాను 21 రోజుల పాటు మాత్రమే కాకుండా వారి జీవితకాలం పాటు పాటించాలని కోరుకుంటున్నాను. కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ చిట్కాల యొక్క ప్రాముఖ్యత గురించి, ఎవరైనా తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలి, గ్రూప్ డిస్కషన్‌ను ఎలా ప్రారంభించాలి మరియు స్టేజ్ ఫ్రిడ్‌ట్ నుండి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు మరియు జాబితా కొనసాగుతుందని తెలిపారు ఈ మూడు గంటల పబ్లిక్ స్పీకర్‌లో విజయం సాధించడానికి రహస్య చిట్కాను పంచారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీ హరి బాబు, రవికాంత్, రాధాకృష్ణ, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








