నిర్మల్
5 న చలో ఢిల్లీ జన చైతన్య యాత్ర సభను విజయవంతం చేయండి


5 నా చాలో ఢిల్లీ జన చైతన్య యాత్ర సభను విజయవంతం చేయండి
సిఐటియు ఆధ్వర్యంలో బాసరలో కరపత్రాల విడుదల
జనం వెలుగు, బాసర:- కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం, కేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న ఛలో ఢిల్లీ లక్షలాది మందితో జరుగుతున్న కార్మిక, కర్షక ఐక్యతా ర్యాలీ ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెనసురేశ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక బాసర గ్రామ పంచాయతీ వద్ద కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఏప్రిల్ 5 చలో ఢిల్లీ విజయవంతం కోరుతూ జిల్లా సదస్సు నిర్వహించారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెనసురేశ్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంపదనంతా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు దోచుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలపై ఎక్కువ పన్నులు మోపడంతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చేశారు. నవరత్నాలుగా పేరొందిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు. లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు రక్షణగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కౌలు రైతులకు రక్షణ లేదన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు. కేంద్రం విధానాలతో రాజ్యాంగం పెను ప్రమాదంలో పడిందని. దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఈ ప్రజావ్యతిరేక, మతోన్మాద, నియంతృత్వ భాజపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పకుంటే ఈ దేశ సంపద అంతా అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు. ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రైతులకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కూలి రోజుకు రూ.600 ఇవ్వాలని, కౌలు రైతులకు సమగ్ర చట్టం తేవాలని కోరుతూ ఈ సదస్సులో తీర్మానం ఆమోదించారు. చలో ఢిల్లీ విజయవంతం కోరుతూ దశలవారీగా ఇంటింటా ప్రచారం, జాతాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించరూ సిఐటియు ఈ కార్యక్రమంలో CITU మండల కార్యదర్శి అల్లం సతీష్, నగేష్, దేవరావు, గంగాధర్, దేవన్న, హస్రప్, సారుబై, హాప్రాస్, భారతి, బోజన్న, భీమ్, L.గంగాధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








