నిజామాబాద్
కదిలించిన దరఖాస్త్రం. సహవిజయం


TOT ట్రైనర్ డి. యల్. యన్. చారి
కదిలించిన దరఖాస్త్రం. సహవిజయం
చేతులెత్తేసిన వారే చేతికందించారు.
మూడే ప్రశ్నలు ముచ్చెమటలు పట్టించాయి
జనం వెలుగు, నిజామాబాద్:- సమాచార హక్కు చట్టం సామాన్యుల ఆయుధం. పాలనలో జవాబుదారితనం, పారదర్శకతే లక్ష్యం. చట్టంపై మరింత ప్రచారం అవసరం.
సమాచార హక్కు చట్టం కింద మూడే మూడు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం కాదు కాదు, సమాచారంతో కదిలించిన జిల్లా యంత్రాంగం వివరాల్లోకి వెళితే సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం సామాన్యులకు వజ్రాయుధం.
ఢిల్లీ నుంచి గల్లి దాకా అదే తీరు ఏ సర్కారు కార్యాలయాన్ని గమనించిన ఒకే స్థాయి నిర్లక్ష్యం ప్రశ్నిస్తే తప్ప పనిచేయని తత్వం నిజామాబాద్ కు చెందిన ప్రముఖ సహోద్యమకారులు ఆర్ టి ఐ ఆక్ట్ 2005 TOT ట్రైనర్ డి. యల్. యన్. చారి. ప్రజలకు ఉపయోగపడే పలు అంశాలపై జిల్లా కలెక్టర్ కు వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం కోసం సహా దరఖాస్తు చేయగా ఒక్కసారి అధికారులు ఉలిక్కిపడ్డారు. సహోదరకస్తుదారుని చిరునామా వెతికి, సమాచారాన్ని అందజేశారు. ఒక సహో దరఖాస్తు తో ఇన్ని శాఖల అధికారులలో కదలిక వచ్చింది. ‘ఇది సహశక్తి. ‘ సహ దరకస్తు ద్వారా ఇప్పటివరకు 3000 పైచిలుకు దరఖాస్తులను వివిధ శాఖలకు డి. యల్. యన్. చారి సంధించారు. మా సమస్యలు చిన్నవైన వ్యవస్థతో పోరాడి వాటిని పరిష్కరించుకున్నాం. సహ చట్టం సహాయంతో అధికారులను ప్రశ్నించి, ఫలితాన్ని రాబట్టుకున్నాం అని డి. యల్. యన్. చారి. తెలిపారు.
ప్రశ్న సామాన్యుడి ఆయుధం.
ఎన్నో సమస్యలు, ఒకటే పరిష్కారం ప్రశ్న. ! ప్రశ్నిస్తేనే జవాబు, నిలదీస్తేనే న్యాయం. ప్రశ్న లేకపోతే మానవజాతి మనుగడే లేదు. ప్రభుత్వ యంత్రాంగాలు అధికారులు చేసే ప్రతి పని ఖర్చు పెట్టే ప్రతి పైసా, ప్రజలకు తెలిస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వ పరిపాలనకు సంబందించిన అన్ని విషయాలను సమాచార హక్కు ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండాలి.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








