Connect with us

ARTICLE'S

కొందరి ధన దాహానికి బలవుతున్న ప్రకృతి వనరులు

janamvelugunews

Published

on

పర్యావరణ పరిరక్షణ పై సోయి లేని ప్రభుత్వాలు

కొందరి ధన దాహానికి బలవుతున్న ప్రకృతి వనరులు

పర్యావరణ కాలుష్యంతో జన జీవితం చిన్నాభిన్నం

ప్రజా చైతన్యమే అంతిమ పరిష్కారం

వడ్డేపల్లి మల్లేశం9014206412

జనం వెలుగు: పర్యావరణ పరిరక్షణ అనే సమస్య విశ్వవ్యాప్తమైనది ఏ దేశానికి ఆదేశంగానూ ఉమ్మడిగాను ప్రభుత్వాలు పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే భూమి ప్రకృతి ఇతర వనరులను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఏ కొందరు నిర్లక్ష్యం చేసిన దాని పర్యవసానాలను అన్ని దేశాలు అనుభవించక తప్పదు. అందుకే ఈ సమస్య అంతర్జాతీయ సమస్య. అట్లని స్థానికంగా ఎక్కడికక్కడ చైతన్యంతో వనరులను పరిరక్షించుకోవడం వినియోగం పైన అదుపు ప్రజల కోసమే వినియోగించబడాలి కానీ పెట్టుబడిదారుల ధన దాహానికి కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలు ప్రజాస్వామిక వాదుల పైన ఉన్నది. లేకుంటే పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు వాటికి మద్దతు పలికే ప్రభుత్వాల అండతో ప్రకృతిని తమ స్వార్థానికి బలి చేస్తారు కూడా జాగ్రత్త అందుకే! మనము నివసిస్తున్న భూమి దానికి చుట్టూ ఆవరించబడినటువంటి జల వాయు ఆవరణములు మానవ మనుగడకు ఆధారమైనటువంటి పంచభూతములతో కలుపుకున్నటువంటి వ్యవస్థ పర్యావరణము అనబడుతుంది. ప్రకృతిలోని వనరులను మానవ అవసరాలకు పరిమితంగా వాడుకుంటే తప్పులేదు. ఎందుకంటే ఒక తరానికి మాత్రమే ఉద్దేశించబడిన వనరులు కావు కదా! అందుకే గాంధీ ప్రకృతి వనరుల పైన ఒక మాట మాట్లాడుతూ” మనిషి అవసరాలను తీర్చవలసిన బాధ్యత ప్రకృతికి ఉంది. కానీ మనిషి ధ న దాహాన్ని తీర్చడానికి ప్రకృతి సిద్ధంగా లేదు” అని హెచ్చరించడంలోనే ప్రకృతి వనరుల దుర్వి నియోగం చేసే వాళ్లతో ప్రమాదము పొంచి ఉన్నది అనేది నగ్నసత్యం. ప్రకృతి వనరులను కాపాడుకోవడంతో పాటు భూమి నేల నీరు, గాలి విషపూరిత పదార్థాలు కలవడంతో ప్రకృతి మానవ అవసరానికి యోగ్యంగా లేకపోవడంతో అనేక విష పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉప్పెనను గమనించిన ఐక్యరాజ్యసమితి 1972లో ఏప్రిల్ 5 నుండి 16వ తేదీ వరకు స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ప్రపంచ పర్యావరణం పైన సుదీర్ఘమైనటువంటి సదస్సును నిర్వహించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించడం జరిగింది. అక్కడ గుర్తించినటువంటి పర్యావరణం యొక్క పరిరక్షణ అంశం చివరికి అదే సంవత్సరం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రతి ఏటా జూన్5 నాడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపు ఇవ్వడంతో చరిత్రలో నిలిచిపోయింది. 1973 జూన్ ఐదవ తేదీన తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటే ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన శీర్షిక, నినాదం, లేదా అంశముతో ప్రపంచవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలకు వేదికైనది అనడంలో సందేహం లేదు. 2023 వ సంవత్సరాన్ని” ఓన్లీ ది ఎర్త్ ” అనే థీమ్ లో నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణ భారాన్ని స్వీడన్ దేశం స్వీకరించినట్లుగా తెలుస్తున్నది

పర్యావరణం విషతుల్యం కావడానికి కారణాలు

ప్రపంచవ్యాప్తంగా అనేక సముద్రాలు జలాశయాలు ఎక్కడికక్కడ చెరువులు కుంటలు వాగులు, వంకలు ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇప్పటికీ మానవ అవసరాన్ని తీర్చడానికి నీటి సంక్షోభం కొనసాగుతున్నది అనే మాట వింటే ప్రకృతిలోని నీరు ఏ రకంగా వినియోగానికి రాకుండా పోతున్నదో అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలు రసానిక పదార్థాలను వినియోగించే సంస్థలు ఇతర అనేక రకాల కర్మాగారాల నుండి వెలువడుతున్నటువంటి వ్యర్థ పదార్థాలు వ్యర్థ జలాలు జలాశయాలలో చేరుతుండడం వలన విషపూరితమవుతున్నాయి. తిరిగి పునః శుద్దీకరణ కార్యక్రమాలు పెద్ద మొత్తంలో లేని కారణంగా ప్రజల డిమాండ్ ను తీర్చగలిగే స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. చి లి, కెనడా, డెన్మార్క్ ,సింగపూర్, స్వీడన్, జర్మనీ వంటి దేశాలు నీటి వనరులను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో కలుషితం కాకపోవడం వలన ఆ దేశాల నీటి అవసరం సునాయ సంగా తీరు తున్నది. కానీ అనేక దేశాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నందువల్ల దుష్పరినామాలు సంభవిస్తున్నాయని గుర్తిస్తే మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వివిధ రూపాలుగా జలాశయాలు సముద్రాలు చెరువులలో కలిసిపోతున్న కారణంగా అనేక జలచరాలు మృత్యువాత ప డడంతో పాటు మానవ మనుగడ కూడా ప్రశ్నార్ధకమవుతున్నది . ముఖ్యంగా భారతదేశంలో 1960 ప్రాంతంలో హరిత విప్లవం కారణంగా ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం గణనీయంగా పెరగడంతో కూడా ప్రకృతి భూమి నీరు, గాలి, వంటి అనేక రకాల ఆవరణాలు కూడా దెబ్బతిని తమ స్వచ్ఛతను కోల్పోయి మనిషికి హాని చేసే స్థితిలోకి నెట్టివేయబడినవి. రక్షణ చర్యలు చేపట్టకపోవడం, సంస్థలు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోవడం, కలుషితమవుతున్నటువంటి వనరులను తిరిగి శుద్దీకరణ చేసే సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, ప్రభుత్వాలకు పర్యావరణ స్పృహపట్ల సోయి లేకపోవడం బాధ్యతరాహిత్యం వంటి కారణాల వలన ప్రకృతి రెట్టింపు స్థాయిలో విషపూరితమవుతుందని గుర్తించాలి. కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు కానీ కొన్ని సంపన్న వర్గాల ప్రయోజనం కోసం ఇసుక ఇతర గనులు భూగర్భ ఖనిజాలను అక్రమంగా తరలిస్తూ గుట్టల విధ్వంసానికి పాల్పడుతూ ఉండడం వలన కూడా భవిష్యత్తు తరాలకు నీరు దొరకనటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. బొగ్గు ఇంధనాలను విచ్చలవిడిగా వాడుతుండడం వలన ఇతర కర్బన ఉద్గారాలను విచ్చలవిడిగా వదిలిపెడుతున్న కారణంగా కూడా పర్యావరణము దెబ్బతిని ఓజోను పో రకు రంద్రాలు పడిన విషయం మనందరికీ తెలిసినదే. ఆ పొరను రక్షించుకో లేకపోతే భయంకరమైనటువంటి అతినీలలోహిత కిరణాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నది. క్రిమిసంహారక మందులు ఎరువులను ఇతర రసాయనిక పదార్థాలను విరివిగా వాడుతుండడం వలన వాయు కాలుష్యం ఏర్పడి లెక్కకు మించిన మృత్యువాతను అనుభవించక తప్పడం లేదు ఈ ప్రకృతి. అంతేకాదు భూమి సారవంతాన్ని కోల్పోయి విషపూరితమై పండిన పంటలను తింటున్నటువంటి ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతూ రాబోయే తరాలకు ఒక అనారోగ్య ప్రపంచాన్ని కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే మనం ఎంత సోయి లేకుండా ఆలోచించకుండా భవిష్యత్తు పట్ల చైతన్యం లేకుండా జీవిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు .

పర్యావరణ విషపూరితం— కొన్ని గణాంకాలు:-

ప్రపంచవ్యాప్తంగా రోజుకు 333 ఎకరాల అటవీ భూమి కనుమరుగవుతున్నది అనే చేదు వార్త భూతాపాన్ని పెంచడానికి వర్షాల నిరోధానికి ప్రకృతి విధ్వంసానికి కారణం అవుతున్న విషయం మనకు తెలియదా ?ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సముద్ర జలాలు నదులు ఇతర జలాశయాలలో కలిసి పోతుంటే జలచరాలతో పాటు మానవ జీవితం కూడా అనారోగ్యం బారిన పడి మృత్యు కుహరంలో కొట్టుమిట్టాడుతున్న విషయం ఇంకెంత కాలానికి మనకు అవగతం అవుతుంది ?. వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 70 లక్షల మంది ప్రజలు మృత్యువాత పడుతున్నట్లు అలాగే నీటి కాలుష్యం కారణంగా 2 లక్షల మంది మరణిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో గణాంకాలు తెలియజేస్తుంటే ఈ భయంకరమైన పరిస్థితులను అధిగమించడానికి మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది అని తెలుస్తున్నది కదా ? వివిధ రకాల విషపూరితాలు వ్యర్థ పదార్థాలు కారకాల వలన ఇప్పటివరకు 85 శాతం చిత్తడి నేలలు తమ యొక్క స్వరూపాన్ని కోల్పోయినట్లు, 75% భూ స్వరూపం ఉపరితలం వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతో పాటు 66% సముద్ర జలాలు తమ యొక్క రూపాన్ని కోల్పోయినట్లు తద్వారా భూమి జలము వంటి వనరుల నుండి మనిషికి లభించవలసిన అవకాశాలలో కోత విధించబడినట్లు మనకు అవగతం అవుతూనే ఉన్నది. ఇక భారతదేశానికి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ 6 శాతం మాత్రమే నీ టి అవసరాలను తీరుస్తున్నట్లు గణాంకాలు తెలియ చేస్తుంటే ఇప్పటికీ భారతదేశంలో 60 కోట్ల మందికి స్వచ్ఛమైన రక్షిత నీరు అందుబాటులో లేకపోవడానికి గమనిస్తే పాలకులు ఎంత కృషి చేయవలసిన అవసరం ఉన్నదో అర్థమవుతున్నది.

ప్రజా చైతన్యమే కీలకం :-

ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అండగానే ఉంటాయి వారి పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాయి కనుక ఈ పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వాలు అంత చిత్తశుద్ధిగా ఉంటాయని నమ్మలేము. ఇది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ధోరణి . ఇక పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ రంగం లోపల వివిధ సంస్థలను స్థాపించి ఉత్పత్తి చేసే క్రమంలో విడుదలవుతున్నటువంటి వ్యర్థ పదార్థాలు వ్యర్థ జలాలు, విషపూరిత పదార్థాలు భూమిని, నేలను, జలాలను, మనిషిని, ప్రకృతిని మొత్తం విషపూరితం చేయడాన్ని మనం గమనిస్తే ఈ విషయం పైన చొరవ చూపి రక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రజల పైన ఉన్నదని గుర్తించడం చాలా అవసరం. ఇందులో ఉద్యోగులు విద్యావంతులు మేధావులు వ్యాపారులు సామాన్య ప్రజల కష్టార్జితంతో జీవిస్తున్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ ప్రకృతిని కాపాడి భావితరాలకు అందించడానికి కచ్చితంగా ఐక్యమై పాలకుల పైన ఉద్యమించి ప్రజలను చైతన్యం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి కృషి ఉద్యమ రూపంలో కొనసాగితేనే పల్లెటూరు నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఈ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఏ ప్రాంతాన్ని తీసుకున్న ఏ రాష్ట్రాన్ని తీసుకున్న పాలకుల యొక్క ప్రయోజనాలు ముఖ్యం కానీ ప్రజల అవసరాలను గుర్తించిన దాఖలా లేదు అందుకు ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వ విధానాలను గమనించినప్పుడు పాలకులకు పర్యావరణ స్పృహ లేకపోవడాన్ని ప్రత్యేకంగా గమనించవచ్చు. స్థానిక వనరులను రక్షించుకోవడానికి, వనరులను పరిమితంగా ఉపయోగించుకోవడా నికి, విషపూరితము కాకుండా చూసుకోవడానికి ప్రజలు ఉద్యమించి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే పాలకులు పెట్టుబడిదారుల పైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ప్రశ్నించకపోతే పాలకులు పెట్టుబడిదారులు ఎంతకైనా తెగిస్తారు వారికి కావాల్సింది లాభం వర్గ ప్రయోజనం మాత్రమే కనక.


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading