ARTICLE'S
బాల ,బాలికలను మాయం చేస్తున్న వ్యభిచారం ముఠాల అక్రమ రవాణా మాఫియాలను శిక్షించాలి


బాల ,బాలికలను మాయం చేస్తున్న వ్యభిచారం ముఠాల అక్రమ రవాణా మాఫియాలను శిక్షించాలి
కమ్యూనిస్టు విప్లవకారుడు జెఎస్ఆర్ డిమాండ్
అమానుష దందానూ అరికట్టండి
ప్రధానమంత్రికి ప్రజా నేస్తం కామ్రేడ్ జే ఎస్ ఆర్ బహిరంగ లేఖ
మానవ అక్రమ రవాణాను అరికట్టండి
మానవ హక్కులను కాపాడండి
సిపిఐ (ఎం-ఎల్ ) రాష్ట్ర కార్యదర్శి
JSR నేతాజీ సుభాష్ చంద్రబోస్
విజ్ఞప్తి
జనంవెలుగు:- అభం శుభం ఎరుగని పిల్లల్ని గద్దల్లా తన్నుకుపోయి దూరప్రాంతాలకు అక్రమంగా తరలించడం ప్రపంచంలో మూడో అతి పెద్ద వ్యాపారంగా స్థిరపడిందనీ… బాధితుల బంధువు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాలు, మాదకద్రవ్యాల తరువాత నేరముఠాలకు మనుషుల అక్రమ రవాణాయే ఎడాపెడా కాసుల పంట పండిస్తోందనీ.. జెఎస్ఆర్ పేర్కొన్నారు. వెట్టిచాకిరి, వ్యభిచారాలతో ముడివడిన అక్రమ రవాణా కేంద్రంగాను కూడలిగానే కాదు… మనుషులు సరఫరాదారుగానూ ఇండియా మారిపోయిందని కమ్యూనిస్టు విప్లవ నేత కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ మేరకు ప్రధానమంత్రి కి రాసిన బహిరంగ లేఖలో ఈసడించుకున్నారు. ఉద్యోగాలు, సినిమాల్లో అవకాశాల ఆశ చూపి బంగ్లాదేశ్ నుంచి యువతులను కోల్కతా తీసుకువచ్చి వ్యభిచార కూపంలోకి దించిన ఉదంతాలెన్నో లోగడ వెలుగుచూశాయనీ… వయసు ఉడిగిపోయాక వారి మూత్రపిండాలు, కాలేయాలు అంగట్లో సరకులైన దారుణాలకు కొదవే లేదనీ అనుక్షణం జనహితం కోరుకునే జె ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అటువంటి తరలింపులు నేటికీ కొనసాగుతున్నట్లు తాజా కథనాలు స్పష్టీకరిస్తున్నాయనీ… దేశీయంగా వలేసి పట్టిన అమ్మాయిల్ని తొలుత ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు చేర్చి ఆపై పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నట్లు అధికారులే చెబుతున్నారనీ.. ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.. అక్రమ రవాణా బారిన పడి అదృష్టవశాత్తు, తప్పించుకున్నవారి కోసం వసతి గృహాలు నెలకొల్పి, వారికి కొత్త జీవితం ప్రసాదించే ఏర్పాట్లు చేయాలన్న జె ఎస్ ఆర్ ప్రజా నేస్తం లాంటి వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుల సూచనలు బుట్ట దాఖలు చేయబడ్డాయని జనహితుడు జె ఎస్ ఆర్ ఆరోపించారు. ఆ స్ఫూర్తికి ఓటేస్తూ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాల ఏర్పాటు నిమిత్తం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరారు. ఆక్రమ రవాణా బాధితులకు అక్కడ ఆశ్రయం, ఆహారం, దుస్తులు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు వంటివి సమకూర్చాలనీ.. ప్రజాతం కోరుకునే ప్రజా నేస్తం జెఎస్ఆర్ విజ్ఞప్తి చేశారు. లోగడ బిహార్, మణిపుర్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని బాలల సంరక్షణ కేంద్రాలెన్నో విచ్చలవిడిగా గాడితప్పిన బాగోతాలు గగ్గోలు పుట్టించాయనీ ముజఫర్పూర్ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందిన 34 మంది బాలికలపై లైంగిక దాడుల దురంతాన్ని అత్యంత దారుణంగా జే ఎస్ ఆర్ పేర్కొన్నారు. కొత్తగా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొల్పుతామంటున్న వసతి గృహాల్లో అటువంటివేమీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్
జే ఎస్ ఆర్ నేతాజీ డిమాండ్ చేశారు. దేశంలో ప్రతి రోజూ సగటున వంద మందికి పైగా పిల్లలు అదృశ్యమైపోతు న్నారంటూ భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జే జే ఆర్ సర్దార్ పటేల్ పదేళ్ల క్రితమే. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పిపోయినవారిని ఆధునిక సాంకేతిక పరి జ్ఞాన వినియోగం ద్వారా కనిపెట్టే పటిష్ట కార్యాచరణకు రాష్ట్రాలు నిబద్ధం కావాలన్న ఆ సంస్థ ప్రతినిధి
జే జేఆర్ సర్దార్ పటేల్ యొక్క అభ్యర్థనకు సరైన మన్నన దక్కుతున్నదెక్కడ? అని అణగారిన వర్గాల అభ్యున్నతిని కోరుకునే ప్రజా శ్రేయోభిలాషి కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
పోను పోను అక్రమ రవాణా జోరెత్తుతోందనీ… భారత్ నుంచి లక్షల సంఖ్యలో ఆడ పిల్లలు వ్యభిచారం పాలబడి ఉంటారన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా, భారత్ లోకి నేపాలీ బంగ్లాదేశీ యువతుల అక్రమ తరలింపు ఇంతలంతలవు తోందనీ జనహితుడు జెఎస్ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మన దేశంలో కొనసాగుతున్న అమానుష వ్యాపారం విస్తృతిని కళ్లకు కడుతున్నాయనీ …ఇటీవల దర్భంగా, కోణార్క్ రైళ్లలో 45 మంది బాలుర్ని ఆక్రమంగా తరలిస్తూ 11 మంది పట్టుబడ్డారనీ చిన్నపిల్లలతో అశ్లీల చిత్రాలు రూపొందించి చలామణీ చేస్తున్నవాళ్లపై ‘ఆపరేషన్ మేఘచక్ర పేరిట దేశ వ్యాప్తంగా సీబీఐ విస్తృత దాడుల ప్రభావం అంతంతమాత్రమేనని కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ తెలిపారు.
దేశంలో ఇప్పటికీ ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు చొప్పున చిన్నారులు తప్పిపోతు న్నారనీ,, వారిలో సగం మంది వరకు శాశ్వతంగా అదృశ్యమైపోతున్నారనీ, రోజుల పిల్లల్నీ గుడ్డలో చుట్టి బిస్కట్లు సరఫరాచేసే పెట్టెల్లో ఉంచి దొంగచాటుగా తరలించిన ఘటనలు, 8-10 ఏళ్ల బాలికలకూ హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి, పడుపువృత్తిలోకి నెట్టేస్తున్న దారుణాలు కోకొల్లలుగా ఉన్నాయని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ బాధపడ్డారు.
బాలబాలికలపై లైంగిక దాడులకు తెగబడేవాళ్ల భరతం పట్టేందుకంటూ పదకొండేళ్లనాడు ‘పోక్సో’ చట్టం రూపొందింది. 2023 జనవరి నాటికి 2.43 లక్షల పోక్సో కేసులు అప రిష్కృతంగా పోగుపడి చట్టం స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నాయనీ ప్రజాతంత్ర వాది కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రాజా నేతాజీ జెఎస్ఆర్ సార్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నపిల్లలు, అభాగినుల రక్తమాంసాలే ప్రధాన పెట్టుబడిగా అమానుష దందా చిలవలు పలు వేసుకుపోతోందనీ జనహితుడు జె ఎస్ ఆర్ ఆరోపించారు.
ఆ కర్కశ మూకల పీచమణచేలా కేంద్రం రాష్ట్రాల మధ్య, వివిధ దేశాల నడుమ అర్థవంతమైన సమన్వయంతో పటిష్ట కార్యా చరణ పట్టాలకు ఎక్కాలనీ వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు. జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రాజన్న జే .ఎస్ .ఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. హేయనేరాల ఉరవడి తగ్గుముఖం పట్టినప్పుడే రేపటి భావి భారత పౌరులైన నేటి బాల బాలికల ముఖాల్లో చిరునవ్వులు వికసిస్తాయని మానవ హక్కుల ఉద్యమకారుడు కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ 9848540078 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










