Connect with us

Education

అధికారి ఒకరు అధికారం ఇంకొకరి చేతిలో

janamvelugunews

Published

on

అధికారి ఒకరు అధికారం ఇంకొకరి చేతిలో

షాడో ప్రిన్సిపల్

భార్య నీడలో భర్త అధికారం.

భార్యా అధికారి అయితే భర్త ఆగడాలకు కొదువే లేదు.

జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిష్టాత్మకంగా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ప్రారంభించారు. కానీ గురుకుల పాఠశాల వ్యవస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఉంది. భావితరాలకు తయారుచేసే విద్యార్థులకు విద్యా,బుద్దులు చెప్పే ఉపాధ్యాయులకు,ఇందూర్ బాయ్స్ ధర్మారం పాఠశాల ప్రిన్సిపల్, పెద్దరికం చలాయిస్తు గెస్ట్ ఉపాధ్యాయులకు చుక్కలు చుయించడం ఎంతవరకు సమంజసం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉపాధ్యాయులకు అధిక పని భారం ఎటువంటి రక్షణ లేదు. జ్యోతిబాపూలే బాయ్స్ పాఠశాల ధర్మారం బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ మానసిక వేదనకు గురి చేస్తున్నారని అక్కడ పనిచేసే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి వ్యక్తులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుల విషయంలో జోక్యం చేసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ పనిచేయాలంటేనే భయంగా ఉందని, మా ప్రాణాలు పోతే మా ప్రాణాలకు బాధ్యులు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఎంత సోచనీయం. పరిస్థితి ఇలానే కొనసాగితే గురుకుల పాఠశాలలో గెస్ట్ ఉపాధ్యాయులు పనిచేయడానికి ఆసక్తి చూపలేని పరిస్థితి రావచ్చు. గెస్ట్ ఉపాధ్యాయుల పట్ల శ్రద్ధ తీసుకోకపోవడంతో వారికి రక్షణ కల్పించడంలో ఆశాఖ అధికారుల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అడిగిన ఉపాధ్యాయులని ఏదో వంకతో బయటకు పంపుతున్నారు. పై అధికారులు వచ్చినప్పుడు ఎలా చెప్పాలని విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ట్రైనింగ్ ఇస్తున్నారని, అధికారులు ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షణ చేస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అని విద్యార్థుల సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. గురుకుల పాఠశాల లను స్థానిక ఎమ్మెల్యే లు పరిశీలిస్తున్నారా ? అనే ప్రశ్నకు వారి నుండి సమాధానం లేదు. అక్కడ పని చేసే ఉపాధ్యాయులు బలి పశువులుగా మారుతున్నారు. ఉపాధ్యాయులపై అధిక పని భారం మోపి, రిజిస్టర్ లో చూపడం లేదని వాపోతున్నారు. ఆదివారం సెలవు రోజు ఒక ఉపాధ్యాయునికి ఉదయం 9నుండి, సోమవారం 1. 30. మధ్యాహ్నం వరకు డ్యూటీ వేశారు. ఆరోజు అధిక వర్షంలో అక్కడికి వచ్చిన ఉపాధ్యాయున్ని 4. నిముషాలు లేట్ వచ్చినందుకు కుండపోత వర్షంలో 42 నిముషాలు నిల్చోపెట్టడం, గురుకుల రూల్స్ లో వుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆరోజు ఆరుగురు లేట్ వచ్చారు. ప్రిన్సిపాల్ కూడా లేట్ వచ్చింది.వారిపై పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. కానీ ఒకే ఉపాధ్యాయుని తో సంజయసి లెటర్ రాయించుకుని భయబ్రాంతులకు గురిచేసిన, అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం తో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి ప్రిన్సిపాల్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గెస్ట్ ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

నందిపేట మండల కేంద్రంలో సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా…..

janamvelugunews

Published

on

నందిపేట మండల కేంద్రంలో సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా…..

 నందిపేట్ ఆగస్టు 17 జనం వెలుగు న్యూస్ : సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో స్థానిక ప్రభుత్వ సాంకేతిక కళాశాల విద్యార్థులు వుయ్ వాంట్ జస్టిస్, శక్తి స్కీం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులంతా రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు.

  విద్యార్థుల ధర్నాకు నందిపేట మండల బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ…. ప్రభుత్వం దుర్మార్గంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, ఐటిఐ విద్యార్థులతో సమానంగా పరిగణించే విధంగా శక్తి పథకం పేరుతో ప్రయోగాలు చేయడం సమంజసం కాదని సాంకేతిక విద్యార్థులు మూడు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉత్తమ విద్యను అభ్యసిస్తామని

   ఈ శక్తి పథకం ద్వారా బీటెక్ వెళ్లేందుకు అడ్డంకులు ఎదురవుతాయని, సాధారణ విద్యార్థుల లాగే మేము కూడా బీటెక్ ప్రవేశ పరీక్షలను రాయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ఈ యొక్క స్కీంను ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Continue Reading

Education

|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి

janamvelugunews

Published

on

భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.

సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.

కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

Education

| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు

janamvelugunews

Published

on

పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు

జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది.  విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.

Continue Reading