Connect with us

Crime

మీడియాపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌర్జన్యం

janamvelugunews

Published

on

◆బాలానగర్ తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ హవా

◆తాసిల్దార్ అధికారులు నిద్రమత్తులో ఉన్నరా.?

◆కార్యాలయంలోకి అనుమతి కావాలంటే ఐడి కార్డు ఉండాల్సిందే.

◆మీడియాకే ఇన్ని అనుమతులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి.?

◆తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లాలంటేనే భయపడుతున్న జనం. కలెక్టర్ సాబ్ జర దేఖో..

జనంవెలుగు, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన కొనసాగుతుంది.అదేవిధంగా తాసిల్దార్ తరలియంలాలో నిజాం నిరంకుశ పాలన కొనసాగుతుంది. అది ఏదో కార్యాలయము కాదు సాక్షాత్తు బాలానగర్ తాసిల్దార్ కార్యాలయంలోకి వెళ్లాలంటే మీడియాకు కూడా అనుమతి కావాలట.? ఏదైనా విషయం గురించి ప్రభుత్వ అధికారిని తాసిల్దార్ సిబ్బందిని అడగాలంటే మీడియా వ్యక్తి అయినా ఎవరైనా సరే అధికారికి ముందుగా తమ ఐడి కార్డును చూపించిన తర్వాతనే కార్యాలయంలో అడుగు పెట్టాలని హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే బాలానగర్ తాసిల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్.శుక్రవారం ఓల్డ్ బోయిన్ పల్లి లో చెరువు సమీపంలో ప్రహరీ గోడ నిర్మాణంలో జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి రెవెన్యూ అధికారి కూలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెలికిరి మహమ్మద్ హబీబ్, సంఘటన స్థలానికి చేరుకొని ఫోటోలు,వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆమె వెంటనే విలేఖరి మహమ్మద్ హబీబ్ పై, ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.మీకు ఎంత ధైర్యం ఉంటే నాతో అడగకుండా వీడియో ఫోటోలు ఎలా తీస్తారు మాకు అడిగి తీయాల్సింది మీకు ఏం అర్హత ఉంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విలేఖరి మహమ్మద్ హబీబ్, పై అధికారుల వివరణ కోసం చరవాణిలో సంప్రదించగా శుక్రవారం నిరుద్యోగులకు టెట్ పరీక్షను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఉన్నతాధికారులు పరీక్ష పర్యవేక్షణలో ఉండటం కారణంగా ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక బాలానగర్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గమనించిన తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది మీడియా సిబ్బంది యొక్క ఫోటోలను తీసి వారి యొక్క ఐడి కార్డులను చూపిస్తేనే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని తెలపడంతో మీడియా కూడా కార్యాలయంలోకి రావడానికి అనుమతి ఎందుకు కావాలి అంటే బాలానగర్ తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం నడుస్తుంది అన్నమాట.? ఆ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని మీడియా కార్యాలయంలోకి రానివ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లకుండా బాలానగర్ లోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నాలుగో స్తంభం గా పిలవబడే మీడియా స్వేచ్ఛకి ఆటంకం కలిగించే రెవెన్యూ ఇన్స్పెక్టర్ పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు శుక్రవారం రోజు కూలగొట్టిన ప్రహరీ గోడ ఎందుకు కూలగొట్టారు.? అది ప్రభుత్వ స్థలమా.? ప్రైవేట్ స్థలమా.? శిఖం భూమి స్థలమా.? అసలు గోడ కట్టింది ఎవరు? అది కూలగోడుతున్నది ఎవరు? అసలు ఫిర్యాదు చేసింది ఎవరు? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాలానగర్ తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న బాగోతం ఏమిటో తెలుసుకోవాలని విలేకరి మహమ్మద్ హబీబ్ తోటి విలేకరులతో చెప్పుకొచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

janamvelugunews

Published

on

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

 కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.

 నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…

   కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని

  గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

janamvelugunews

Published

on

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ

  శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Continue Reading

Crime

Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

janamvelugunews

Published

on

నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

 స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు

 మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు

 నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

  హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.

  కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading