Connect with us

నిజామాబాద్

విజయబేరి సభను విజయవంతం చేయండి

janamvelugunews

Published

on

విజయబేరి సభను విజయవంతం చేయండి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో రేపు హైదరాబాద్ లో తుక్కుగూడ వేదికగా జరగబోయే విజయబేరి సభకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియామ్మకు కృతజ్ఞతగా నందిపేట్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చి జయప్రదం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ వైయస్ గంగాధర్, ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ఏడ్డిగారి నిఖిల్, దమ్మాయి శ్రీనివాస్, పిరాజీ నాగరాజ్, ఎర్రం పవన్, సోహెల్, సమీర్, పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

Thammali Pandu

Published

on

DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే 

జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.

స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.

Continue Reading

నిజామాబాద్

కాంగ్రెస్ శ్రేణులతో  రూరల్ ఎమ్మెల్యే  ఆత్మీయ భేటీ

Thammali Pandu

Published

on

కాంగ్రెస్ శ్రేణులతో  రూరల్ ఎమ్మెల్యే  ఆత్మీయ భేటీ

డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ 

 దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం 

 పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు 

జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్  చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading