నిజామాబాద్
ఆదివారం అక్రమ ఇసుక రవాణా


ఆదివారం అక్రమ ఇసుక రవాణా
– పట్టించుకోని అధికారులు…
– ప్రభుత్వ ఆదాయానికి గండి…
జనంవెలుగు, రుద్రూర్ : పగలు, రాత్రి, ఆదివారం సెలవు అనే తేడా లేకుండా కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా దాందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా కొనసాగిస్తున్నారు. వే బిల్లులు లేకుండా పోతంగల్, సునికి మంజీరా నది నుండి ఇసుకను అక్రమంగా ప్రతిరోజు పదుల సంఖ్యల ట్రాక్టర్లలో రాత్రి, పగలు, ఆదివారం అనే తేడా లేకుండా కోటగిరి, రాంపూర్, రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారు మీదుగా వర్నిలో గల ఓ కాంట్రాక్టర్ సిసి రోడ్ల నిర్మాణం కొరకు తీసుకెళుతున్నట్టు అక్రమ ఇసుక రవాణా దర్జాగా నిర్వహిస్తున్నారని కొందరు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణా పై అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత జోరుగా ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత దర్జాగా ఇసుక తరలిస్తుంటే వారి వెనుక బడాబాబుల హస్తముందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ అక్రమ దందా కొనసాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తుందని పలువురు వాపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను సుమారు 3 వేల 500 రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు అమ్మకాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పెడతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








