Connect with us

నిర్మల్

రోడ్డెక్కిన 104 ఎఫ్ హెచ్ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు

janamvelugunews

Published

on

రోడ్డెక్కిన 104 ఎఫ్ హెచ్ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు

జనం వెలుగు, నిర్మల్:- నిర్మల్ జిల్లా కేంద్రంలో 104 ఉద్యోగులు శాంతియుత నిరసన సోమవారం ప్రారంభించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అందరూ ఏకమై నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 104 ఉద్యోగులు 2008 నుండి డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ పద్ధతిలో జీఓ నెం. 1636, మెమో నెం .20639 ల ప్రకారం పూర్తిగా ప్రభుత్వాధీనంలోనే ( డ్రైవర్లు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు , ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు , సెక్యూరిటీ గార్డులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏఎన్ఎంలు ) 1,350 మంది విధులు నిర్వహిస్తున్నారని, గత 15 సంవత్సరాలుగా 104 ఉద్యోగులు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తంచేశారు. చాలీచాలని వేతనాలతో సేవలు అందిస్తున్నామని, వాహనాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిన సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పిస్తానని ప్రభుత్వం హామీనిచ్చిందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులను పిహెచ్సి, సిహెచ్సీలు, ఏరియా హాస్పిటల్లో టి హబ్ సెంటర్లలో ఉద్యోగులను రీ – డిప్లై చేసిoది. ఉద్యోగులు కరోనా సమయంలో కూడా సేవాలందించామని, 104 ఎఫ్ఎహెచ్ఎస్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్కు అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ చేయడం లేదని వాపోయారు. జీఓ నెం. 60 ప్రకారం ఉద్యోగులకు స్లాబ్ పద్ధతిన వేతనాలు చెల్లించడం వలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వాధీనంలోనే పని చేస్తున్నప్పటికీ వేతనాలు ఏజన్సీల ద్వారా చెల్లించడం వలన సకాలంలో వేతనాలు అందడం లేదని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాలో ట్రెజరీ ద్వారా వేతనాలు జమ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో 2023 సెప్టెంబర్ 25 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. రెండవ ఏఎన్ఎంలుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, ఉద్యోగులకు వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని, హెల్త్ కార్డు లేదా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, 35 క్యాజువల్ లీవులు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్నిరకాల సెలవులు అమలు చేయాలని. డేటా ఎంట్రీ ఆపరేటర్లను, కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించాలనే ప్రధాన డిమాండ్లను తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, వెంకటస్వామి, భాస్కర్ బాబు, ప్రత్యూష, పండిత్, రాజేందర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading