Connect with us

Politics

స్పీడ్ పెంచిన గులాబీ బాస్…ఇంచార్జీల నియామకం

janamvelugunews

Published

on

స్పీడ్ పెంచిన గులాబీ బాస్…ఇంచార్జీల నియామకం

జనంవెలుగు, హైదరాబాద్ అక్టోబరు 13:- తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలాఖరులో జరగనున్నందున బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ప్రచారం విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించింది. ప్రస్తుతానికి 54 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. కొత్తగా నియమితులు అయిన వీరందరితో మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌రావు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించారు. బీఆర్ఎస్ విజ‌యానికి అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌, వ్యూహాలపై కేటీఆర్, హ‌రీశ్‌రావు దిశానిర్దేశం చేశారు.అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని అన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వానికి ప్రజ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని ప‌దేళ్ల అభివృద్ధిని ప్ర‌తి గ‌డ‌ప‌కు తీసుకెళ్లి ప్రజల్ని ఓట్లు అడ‌గాల‌ని సూచించారు. విప‌క్షాల‌కు ఎన్నిక‌లు కేవ‌లం హామీలు ఇచ్చే వేదిక‌లు మాత్రమే అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఫ‌లాలు అందుకున్న ప్ర‌తి ఒక్క‌రి ఇంటికి వెళ్లాలని, వారితో మ‌మేకం కావాల‌ని ఆదేశించారు.పార్టీ శ్రేణుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించి, బీఆర్ఎస్ గెలుపున‌కు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. గ‌తం కంటే అత్య‌ధిక స్థానాల‌ను గెలిచేందుకు కృషి చేయాల‌న్నారు.
54 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలు వీళ్లే..
బోధ‌న్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌
నిజామాబాద్ అర్బ‌న్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌
గ‌జ్వేల్ – మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి
మ‌ల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ముదోల్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్
ఉప్ప‌ల్ – చైర్మ‌న్ రావుల శ్రీధ‌ర్ రెడ్డి
ఇబ్ర‌హీంప‌ట్నం – మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి
బెల్లంప‌ల్లి – ఎంపీ వెంక‌టేశ్ నేత‌
జ‌గిత్యాల – ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్
రామ‌గుండం – మాజీ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌
మంథ‌ని – ఈద శంక‌ర్ రెడ్డి
పెద్ద‌ప‌ల్లి – చైర్మ‌న్ ర‌వీంద‌ర్ సింగ్
మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్ర‌సాద్
చొప్ప‌దండి – మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్
న‌ర్సాపూర్ – ఎమ్మెల్సీ వెంక‌ట‌రాం రెడ్డి
జ‌హీరాబాద్ – మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్ర‌సాద్
సంగారెడ్డి – చైర్మ‌న్ వీ భూపాల్ రెడ్డి, చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్
దుబ్బాక – చైర్మ‌న్ బాల‌మ‌ల్లు
వేముల‌వాడ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
మాన‌కొండూరు – సుడా చైర్మ‌న్ జీవీ రామ‌కృష్ణ‌
మెద‌క్ – కే తిరుప‌తి రెడ్డి
ఆందోల్ – మాజీ ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ హుస్సేన్
ఖానాపూర్ – ఎమ్మెల్సీ దండె విఠ‌ల్
ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధ‌ర్ గౌడ్
కామారెడ్డి – ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్
బోథ్ – మాజీ ఎంపీ న‌గేశ్
వైరా – ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు
స‌త్తుప‌ల్లి – ఎంపీ పార్థ‌సార‌థి రెడ్డి
చేవెళ్ల – ఎంపీ రంజిత్ రెడ్డి
వికారాబాద్ – ఎంపీ రంజిత్ రెడ్డి
ముషీరాబాద్ – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్ర‌భాక‌ర్
అంబ‌ర్‌పేట్ – క‌ట్టెల శ్రీనివాస్ యాద‌వ్, అడ్వ‌కేట్ మోహ‌న్ రావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
మ‌క్త‌ల్ – చైర్మ‌న్ ఆంజ‌నేయులు గౌడ్
గ‌ద్వాల్ – మాజీ చైర్మ‌న్ రాకేశ్ చిరుమ‌ళ్ల‌
క‌ల్వ‌కుర్తి – చైర్మ‌న్ గోలి శ్రీనివాస్ రెడ్డి
నాగార్జున సాగ‌ర్ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామ‌చంద్ర నాయ‌క్
హుజుర్ న‌గ‌ర్ – విజ‌య‌సింహా రెడ్డి
కోదాడ – ఎమ్మెల్సీ టీ ర‌వీంద‌ర్ రావు
న‌ల్ల‌గొండ – జ‌డ్పీ చైర్మ‌న్ బండా న‌రేంద‌ర్ రెడ్డి
న‌కిరేక‌ల్ – ఎంపీ బడుగుల లింగ‌య్య యాద‌వ్
అచ్చంపేట – చైర్మ‌న్ ఇంతియాజ్ ఇషాక్
కొల్లాపూర్ – ఎంపీ రాములు
అలంపూర్ – ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి
భూపాల‌ప‌ల్లి – ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య‌
ములుగు – ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి
ఇల్లందు – ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌
వ‌రంగ‌ల్ ఈస్ట్ – మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్ర‌కాశ్
భ‌ద్రాచ‌లం – ఎమ్మెల్సీ తాత మ‌ధు
మ‌హ‌బూబాబాద్ – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్
న‌ర్సంపేట – చైర్మ‌న్ వీ ప్ర‌కాశ్.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading