నిజామాబాద్
మహారాష్ట్రకు ప్రతిరోజు భారీగా తెలంగాణ ఇసుక


మహారాష్ట్రకు ప్రతిరోజు భారీగా తెలంగాణ ఇసుక
జనంవెలుగు, నిజామాబాద్:- మహారాష్ట్ర ట్రాక్టర్ యజమానుల నుంచి భారీగా వసూలు చేస్తున్నరని ప్రచారం జరుగుతోంది. 50 వరకు ట్రాక్టర్లు తెలంగాణ ఇసుకను మహారాష్ట్రకు ప్రతిరోజు తరలింపు మామూలు ఇచ్చిన వారికి వదిలి పెడుతున్నారు ఇవ్వని వారికి పట్టుకొని తూ తూ మంత్రంగా కేసులు చేసి వారి నుంచి భారీగా వసూలు. మామూలు ఇవ్వకపోతే తన ట్రాక్టర్ పట్టుకుని సుమారు 15 నుంచి 20 వేల రూపాయలు వసూలు చేసుకుని వదిలిపెడుతున్నారని ఆరోపణలు ఎక్కకువగా వినిపిస్తున్నాయి. వారి డ్యూటీ ఇసుకపై కాదు కానీ అక్రమ ఇసుక తరలించే వారి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తూ వారికి పరోక్షంగా సపోర్ట్ చేయటంలో అధికారులు ఇంట్రెస్ట్ ఏంటని ప్రశ్నర్తకం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక మాఫియా దారుల నుంచి అధికారులు భారీగా వసూలు చేస్తున్నరని గుసగుసలు గుప్పుమంటున్నాయి నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రం సరిహద్దు ప్రాంతం చెక్పోస్ట్ వద్ద ఉన్న మంజీర సరిహద్దు ప్రాంతం నుంచి తెల్ల ఇసుకను మహారాష్ట్రకు చెందిన సుమారు 50 మంది ట్రాక్టర్ యజమానులు ప్రతిరోజు ఇసుకను మహారాష్ట్ర కు తరలించి వాటిని విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు, వారి వద్ద భారీగా వసూలు చేస్తూ తమకేమిలే అన్న చందంగా వ్యవహరిస్తూ మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అసలు అధికారులు డ్యూటీ ఇసుకపై పర్యవేక్షణ కాదు అయినప్పటికీ అధికారులు అత్యుత్సాహం చూపుతూ తమ విధులు కాకుండా ఉన్నప్పటికీ భారీగా మామూలు వసూలు చేస్తూ ఇవ్వని వారికి బెదిరింపులు చేసి చర్యలు తీసుకుంటామని భయబ్రాంతులకు గురి చేస్తూ, వారి వద్ద భారీగా మామూలు తీసుకుంటూ, నామమాత్రంగా చర్యలు తీసుకొని వదిలి పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియా వాహనాన్ని పట్టుకొని ఓ కార్యాలయంలో పెట్టి అతని వద్ద సుమారు 15 నుంచి 20 వేల రూపాయలు లంచంగా తీసుకున్నారని, నామమాత్రపు చర్యలు తీసుకొని వదిలి పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న మంజీరా ఇసుకకు మహారాష్ట్రలో అధిక డిమాండ్ ఉండడం వల్ల, తెలంగాణ మంజీరా నదిలో తెల్ల ఇసుక మంచిగా ఉంటుందని, మహారాష్ట్రలో ఇసుక నల్లగా ఉండి కంకర ఉంటుందని అందుకే తెలంగాణ ఇసుకకు మహారాష్ట్రలో అధిక డిమాండ్ ఉండడంతోపాటు అధిక ధర పలుకుతుందని దీంతో సుమారు మహారాష్ట్ర నుంచి ఒక ముఠాగా ఏర్పడి 50 నుంచి 100 మంది ట్రాక్టర్ల ద్వారా వచ్చి ఇసుకను నింపుకొని పోతూ వాటిని అధికా ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు తెలంగాణ మంజీరాలో ఉన్న తెల్ల ఇసుకను తీసుకొస్తుంటే ఎవరైనా స్థానికులు అడ్డుపడితే వారిపై దాడులు చేసి చావు దెబ్బలు కొడుతున్నారని ఇలాంటి సంఘటన ఎన్నో జరిగినవి అని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానికులు మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు దాడులు చేశారని చర్యలు తీసుకోవాలని అధికారుల వద్దకు వెళ్తే అధికారులు చర్యలు తీసుకోకపోగా ఉల్టా ప్రశ్నించిన స్థానికులపై చర్యల పేరుతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని కారణం ఏమంటే మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు అధికంగా మామూలు ఇవ్వడం వల్ల వారిపై చర్యలు తీసుకోకపోగ వారికి మద్దతుగా ఉంటూ ప్రశ్నించిన స్థానికులపై వేటు వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర ఇసుక మాఫియా దార్లకు అధికారులకు మధ్య కొంతమంది తెలంగాణకు సంబంధించిన ఇసుక బ్రోకర్ ఉంటారని వారి ద్వారానే అధికారులకు మామూలు పోతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులపై చర్యలు తీసుకొని తెలంగాణ ఇసుక మహారాష్ట్రకు దొంగలించకుండా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు, మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తూ వారి నుంచి భారీగా మామూలు వసూలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిజామాబాద్
మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు


మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.
మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్
ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.








