Connect with us

Politics

మెనిఫెస్టోల మాయాజాలం ఓటర్లకు గాలం

janamvelugunews

Published

on

గెలుపు బాటలో అభ్యర్థుల హోరా హోరీ

ఎవరికి వారే ఎత్తులతో ప్రచారం

ఉచిత పథకాల మోజులో స్పందన లేని జనం

జనంవెలుగు, నిజామాబాద్:- ఎన్నికల సమయంలో అభ్యర్థిని, ఓటు వేసి గుర్తును, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఎలా అంచన వేయాలో ప్రజాకవి కాళోజి చేసిన సూచనలను ఓటర్లు పాటిస్తే ఉన్నంతలో కొంత మెరుగైన వ్యవస్థను తెచ్చుకోవచ్చు. జెండాను చూసి కాకుండా అధికారం మాటున అక్రమార్జన చేసి, ప్రజల పొట్ట కొట్టినాడా? పరిశీలించమన్నాడు. ఈ పరిశీలన అంశాలు ఓటర్లు కచ్చితంగా పాటించవలసిందే.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ముందు పెట్టవలసిన ప్రజల డిమాండ్లు విద్యా, వైద్యం, ఉపాధి మౌలిక అవసరాల కోసం నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. తక్షణ ప్రయోజనం కోసం పార్టీలు ప్రకటిస్తున్న తైయిలాలు ఉచితలకు పేద మధ్యతరగతి వర్గాలు నమ్మడం లేదు. సమాజం యొక్క సుదీర్ఘ భవిష్యత్తును తాకట్టు పెట్టకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం డిమాండ్ చేయడం హర్షించదగ్గ విషయం. ప్రధానపార్టీ లైన బి ఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ రాజకీయ పార్టీల ముందు డిమాండ్ రూపంలో పెట్టడం ద్వారా ప్రభుత్వాలని శాసించే స్థాయికి ప్రజలు ముందుకు రావడం నిజంగా గొప్ప విషయం. ఇప్పటికైనా ప్రజల ముందు ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లలను, జరిగిన లోపాలను తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను అంగీకరించకపోతే ప్రజలు యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అంగీకరించక తప్పదు. ప్రస్తుతం బారాస పార్టీ తన మేనిఫెస్టోలో అనేక హామీలను పొందుపరిచిన విషయాన్ని గమనించిన కాంగ్రెస్ భాజపాలు అనివార్యమైన పరిస్థితులలో పోటీపడుతున్న విషయం గమనిస్తే, ప్రజలను స్వతంత్రంగా జీవించడానికి అలవాటు చేస్తే బాగుండేది. ఈ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీలు చేయడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని అనేక చోట్ల నిరుద్యోగులు పోటీలో కొనసాగుతున్నారు. ఈసారి ప్రభుత్వన్ని గద్దే దించడానికి నిరుద్యోగుల పక్షాన విశ్వవిద్యాలయ విద్యార్థులు నడుము కట్టినారు. ప్రభుత్వాన్ని కదిలింప చేస్తున్నారు.

చిరు వ్యాపారులు, పేద కుటుంబాలు కూలీలు, కార్మికులు భూమి లేనటువంటి నిరుపేద వలస జీవులకు ఇప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధ్యత రాహిత్యమే. ప్రజా ప్రతిఘటన తప్పదని మేధావి వర్గం అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది నిజామాబాద్, అర్ముర్ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు నువ్వా… నేనా అనే విధంగా ప్రచారం కొనసాగుతున్నది. ప్రతి అభ్యర్థి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పార్టీలోని కిందిస్థాయి క్యాడర్ తో నేతల్లో భయం మొదలైంది. అధికార పార్టీ నేతకు సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం నాదేనని దీమతో ఉన్న నేతకు ఎదురుగాలు వీస్తున్నట్టు తెలుస్తోంది. అనుకున్నా అంచనాలను తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల వ్యతిరేక నిరసనలు, అడ్డగింపులు, లో లోన ఓటమి భయం ఉన్న అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నేతల బెదిరింపులు సామాజిక మధ్యమాల్లో వైరల్ కావడంతో తనకు ఓటమి భయం పట్టుకుందని ప్రజలనుకుంటున్నారు. గ్రామాల్లో ప్రచారం కు వెళ్లినప్పుడు నేతలకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్లు, ఫించన్లు, డీఎస్సీ 98 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వలేదు. బీసీ బందు పథకం నిరుపేదలకు అందలేదు. హామీలు నెరవేర్చలేదని గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నారని ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. స్థానిక ప్రతినిధులు మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెబుతూ ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఉన్న నేతల్లో కూడా అసహనం గ్రూపు రాజకీయాల ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో తలనొప్పులు మొదలయ్యాయి. అన్ని పార్టీల అభ్యర్థులు తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నాప్పటికీ గెలుపు ఎవరిని వరిస్తుందో పోలింగ్ తర్వాతే తెలుస్తుంది. బిజెపి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటమి భయం వెంటాడుతోంది. పార్టీలోని సొంత క్యాడర్ తో వెన్నుపోటు భయాం అభ్యర్థుల్లో మొదలైంది. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏ నేత ఏ పార్టీకి పని చేస్తున్నారో అర్థం కాక ఆ పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు

తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు నడుం బిగించి స్వరాష్ట్ర సాధనకై కదం తొక్కారు. రాష్ట్రం వచ్చిన ఆశలు అడిఅ శలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ఇలాంటి సమయంలో 119 నియోజకవర్గాల్లో నిజామాబాద్, ఆర్మూర్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.ముక్కోణపు పోటీ కనిపిస్తుంది. కానీ ప్రజలకు ఏ పార్టీని నమ్మాలో ఇప్పటికీ అర్థం కాక సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. యువత ఒటే కీలకమంటున్నారు. యువత మాత్రం బరిలో ఉన్న నిరుద్యోగులనే బలపరుస్తున్నారు. అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాలి.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఓ ప్రచార అస్త్రంగా మారింది. పలు నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో స్థానికేతర్లకు పార్టీలు టికెట్లు కట్టబెట్టాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు లోకల్ అని ముద్ర వేసుకుంటున్నారు. అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని స్థానికేతలను గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి.

కారు గల్లంతే ?

బిఆర్ఎస్ ఎదురీత

అన్ని నియోజకవర్గాల్లో కారు.. సర్కారుకు భంగపాటే

ఈసారి నిజామాబాద్ జిల్లా ప్రాంతంలోని మెజార్టీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ బిఆర్ఏస్ గట్టి ఎదురు దెబ్బ తప్పేలా లేదు. ఈ ప్రాంతంలోని బీఆర్ ఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎదురుదుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తేట తెల్లం చేస్తున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల మీద అనేక అవినీతి ఆరోపణలు అడ్డగోలు దందా లు, దీంతో నిజామాబాద్,అర్ముర్ ప్రాంతంలో అధికార పార్టీ ఓటర్లకు భారీ స్థాయిలో గండి పడే పరిస్థితిలే ఉన్నాయి. కావలసినంత వ్యతిరేకత తెచ్చి పెట్టుకున్నారు.ఆర్మూర్ లో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఆగడాలకు, బెదిరింపులకు, రాజకీయాలకు తట్టుకోలేక అసంతృప్తితో వేరే పార్టీలో చేరారు. ఉన్న కొందరు నాయకులకు ఎప్పుడో ఒకప్పుడు తిప్పలు తప్పలేదు ఉండకనే ఉంటూ లోపలి రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు గుసాగుసలాడుతున్నారు.

కమలం వికసించేనా ?

బిజెపి అభ్యర్థులు తమదైన శైలిలో మాట్లాడుతూ ప్రత్యర్థులపై హెచ్చరికలతో కూడిన ఆరోపణలు చేయడం వల్ల ప్రజలు మరింత దగ్గర అయ్యారనేది నిజం. ప్రజలు మార్పు కోరుకోవడంతో, గెలిచే అవకాశాలు ఉన్నాయా?ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఎదనీ ప్రజలు గుస గుస లాడుతున్నారు. ఏది ఏమైనా రాజకీయ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారిందని చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు అమలయ్యేనా ?

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలు మేనిఫెస్టో పై ప్రజలు అప నమ్మకంతో ఉన్నారు. సంక్షేమ ఫలాలు సాధ్యం కానివని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న అభివృద్ధి ఏమి జరగలేదని స్థానికులు అంటున్నారు. బ్రష్టు పట్టిన వ్యవస్థకు చరమగీతం పాడే వజ్రాయుధం ఓటు అని ప్రజలు అంటున్నారు.

రసవత్తరంగా మారిన ఆర్మూర్ నిజామా బాద్ రాజకీయం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో అన్ని పార్టీలు ఆఖరిపోరాటానికి సన్నద్దమయ్యాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు పడరని పాట్లు పడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎంత నిఘా పెట్టినా, ఎన్ని చర్యలు తీసుకున్న అభ్యర్థులు ప్రచారానికి భారీగా ఖర్చు చేయడంతో పాటు ఓటర్ల కు రక రకాల తైయిలాలు ఇస్తారన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణ రాజకీయ పార్టీలకు వీడ్కోలు పలుకుతారని ప్రజలు అంటున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి చెందలేదు. అన్ని పార్టీలకు గ్రాఫ్ తగ్గింది. వచ్చేది ఇండిపెండెంట్ అభ్యర్థులేనా అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది

janamvelugunews

Published

on

తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.

జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.

సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.

ఆర్మూర్లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.

Continue Reading

Politics

| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి

janamvelugunews

Published

on

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు

జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం

మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి

జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.

Continue Reading

Politics

| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది

janamvelugunews

Published

on

మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం

జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.

చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్‌లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.

*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం

Continue Reading