Education
అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టెస్ట్ (అమాట్) కు విశేష స్పందన


అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టెస్ట్ (అమాట్) కు విశేష స్పందన


జనం వెలుగు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో అనిల్ గంటడి:- భారతదేశ గణిత శాస్త్ర అభివృద్ధికి మరియు గణిత శాస్త్రానికి నూతన అధ్యాయాన్ని కనుగొన్న మహనీయుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ అని భారతదేశ గణిత శాస్త్రానికి ఎనలేని కృషి చేశారని, వారి ఆలోచన విదానం చాలా స్ఫూర్తిదాయకమైనదని పాఠశాల నిర్వాహకులు స్థానిక ఆదర్శనగర్ మరియు డాక్టర్స్ స్ట్రీట్ ని పాఠశాల మరియు కళాశాలలో వేడుకగా నిర్వహింపబడిన అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టెస్ట్ (ఆమాట్) నిర్వాహణకు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. విద్యార్థుల సమక్షంలో ప్రశ్నపత్రాలను విడుదల చేసి పరిక్ష రాసే విధానాన్ని వారు వర్ణించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ చేసినటువంటి సేవలు చాలా స్ఫూర్తిదాయకమైనవి స్ఫూర్తిదాయకమని చిన్నతనం నాటినుండే గణిత శాస్త్రం పట్ల చాలా దృష్టి వహించేవారని అదే ఆసక్తిని క్రమక్రమేన పెంపొందించుకొని పలు శాస్త్రవేత్తలు చేపట్టినటువంటి పరిశోధనలకు ఆకర్షితులై ప్రత్యేకంగా రామానుజన్ గణిత శాస్త్రంలో వివిధ నూతన విషయాలకు భీజం వేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో పరీక్షను గంట పాటు నిర్వహించడం జరిగినదని తెలుపుతూ ప్రతి విద్యార్థి రామానుజన్ ఆశయాలకు అనుగుణంగా వారు నిర్దేశించిన మార్గ దర్శకాలను పాటిస్తూ నూతన విషయాలను తెలుసుకోవాలని చెప్పారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినటువంటి విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అట్టహాసంగా నిర్వహింపబడే జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో అతిధుల చేతుల మీదుగా బహుమతలును ప్రదానం చేయడం జరుగుతుందని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో నిర్వహించినటువంటి ఈ పరీక్షలో సుమారు 12,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతటి అపూర్వ స్పందన అందించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికై విశేష శేష కృషి చేసిన 5 విద్యార్థులకు వారు । వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షకు కావల్సిన వనరులను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, టీచర్స్, తల్లిదండ్రులు, నరేందర్ రెడ్డి చైర్మెన్ పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
Crime
రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి


రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.








