Crime
అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవి మృతి


అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవి మృతి
జనంవెలుగు, బోధన్:- బోధన్ మండలం కల్దుర్కి గ్రామ శివారులో తన సొంత వ్యవసాయ పనులకు పవన్ తండ్రి : నాగ్ గొండ వయస్సు (26) వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం 8 నుంచి 9 గంటల సమయం మధ్యలో ఎడ్లని తీసుకొని తన పొలం గెట్టు పక్కన వెళ్ళే దారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లెవెన్ కె.వి 25 కేవి ట్రాన్స్ఫార్మర్ స్తంభంతో సహా కిందికి వంగి పోవడం వలన వ్యవసాయ పనులకు వెళుతున్న వ్యవసాయ దారుని ఎద్దు మూగజీవి విద్యుత్ షాక్ తలిగి అక్కడికక్కడే ఎద్దు చనిపోవడం జరిగింది. విద్యుత్ అధికారులకు గతంలో పలుమార్లు సమాచారం ఇచ్చిన ఇట్టి విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్ను సరి చేయమని చెప్పగా పట్టించుకోకపోవడం వల్లనే మూగజీవి ఎద్దు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వలన ఈరోజు మూగజీవి చనిపోవడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గడ్డితీగలతో చుట్టుకొని అలలు అల్లి కింది నుండి పై స్థాయి లైన్ వరకు మొత్తం గడ్డి తిగతో అల్లుకు పోవడం జరిగింది. ఇట్టి విషయమై విద్యుత్ అధికారి లైన్మెన్ శేఖర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామ ప్రజలు వ్యవసాయదారులు అన్నారు. ఇట్టి విషయమై లైన్మెన్ శేఖర్ ను వివరణ కోరగా నాకు ఎలాంటి సంబంధం లేదని మాపై అధికారులు వచ్చి ఇట్టి విషయాన్ని పంచనామా చేసి క్లైమ్ చేపిస్తామని నామమాత్రంగా చేతులు దులుపుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఇంత జరిగినా కూడా విద్యుత్ అధికారులు నమ మాత్రంగా వచ్చి మాకు ఎలాంటి సంబంధం లేదని చూసి చూడనట్టుగా వచ్చి వెళ్లిపోవడం జరిగింది. దయచేసి నాకు న్యాయం చేసి విద్యుత్ అధికారులకుపై తగు చర్య తీసుకొని నన్ను ఆదుకోవాలని ఎద్దు యజమాని అన్నారు.
Crime
జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..


జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..
కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.
నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని
గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
Crime
మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..


మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..
నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ
శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్‌కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Crime
Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….


నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….
స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు
మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు
నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.
హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.
కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.










