నిజామాబాద్
పోరాట పటిమగల సంఘం టి పి టి ఎఫ్


టి పి టి ఎఫ్ ద్వితీయ విద్య, వైజ్ఞానిక మహాసభలు విజయవంతం కావాలి!
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఆరీపుద్దీన్ ఆకాంక్ష
జనంవెలుగు, నిజామాబాద్:- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టిపిటిఎఫ్ సంఘం ఉపాధ్యక్షులు సంక్షేమం పట్ల నిబద్ధత గల సంఘమని ఆయన అన్నారు. గత ఎపిటిఎఫ్ నుండి నేటి టి పిటిఎఫ్ వరకు అనేక పోరాటాలు చేసి, ఉపాధ్యాయ లోకానికి ఎన్నో జీవోలు అందించిన ఘనత టి పి టి ఎఫ్ ది అని అన్నారు. ఈ సందర్భంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్ మహమ్మద్ ఆరీఫుద్దీన్ మాట్లాడుతూ, ఖమ్మంలో టిపిటిఎఫ్ ద్వితీయ విద్య, వైజ్ఞానిక మహాసభలు జరపడం శుభ పరిణామం అన్నారు. విద్య రంగానికి ఉపాధ్యాయ లోకానికి మేలు జరిగే తీర్మానాలు చేయాలని కోరారు. ఈరోజు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శక్కర్ నగర్ బోధనలో టి పి టి ఎఫ్ కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్స్ ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర విద్యారంగం ‘దశ దిశ ‘ను మార్చే మహాసభలని ఆశ భావం వ్యక్తం చేశారు. విద్యారంగం బాగుంటేనే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా పోరాడే టిపిటిఎఫ్ సంఘానిది వెలకట్టలేని పాత్ర అని కొనియాడారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు హన్నా గ్రేస్ కోణాల, దుర్గా గంగాలత, సులోచన, రాజమణి, నరేందర్ ఫెడరేషన్ కార్యకర్త టీచర్ నాగేష్ దయావర్, గంగాధర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








