Connect with us

నిజామాబాద్

ప్రశ్నించే తత్వాన్ని మరవోద్దు

janamvelugunews

Published

on

ప్రశ్నించే తత్వాన్ని మరవోద్దు

అన్యాయాన్ని ఎదిరించడంలో ముందు ఉండాలి

కత్తి కంటే కలం గొప్పది

జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి

జనంవెలుగు, నిజామాబాద్:- సమాజంలో జరిగే మంచి చెడులను అవినీతి అక్రమాలను అందరికీ సమాచారం తెలిపే పవిత్ర వృత్తి విలేకరి. అంతటి ప్రాముఖ్యత గల విలేకరులపైచిన్నా చూపు పనికి రాదు. కలం యోధులు ఘోషించాల్సి వచ్చింది. విలేకరులు రాకపోతే ఎంత పెద్ద సభ అయినా వార్తలో వెలగదు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారిపోతాయని ఆశపడ్డారు. ప్రభుత్వ ఆరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు. లాఠీ దెబ్బలకు వేరువలేదు. విలువైన జీవితాలను ఫానంగా పెట్టారు. దశాబ్దాల కాలంగా సొంత ఇల్లు లేక అద్దె గదుల్లో నివాసముంటున్న జర్నలిస్టులకు, సొంత ఇంటి కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిని విస్మరిస్తున్నారు. వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. ఎటువంటి ఆంక్షలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని సీనియర్ జర్నలిస్టు డి.ఎల్. యన్.చారి డిమాండ్ చేశారు. బాధ, అనే పేపర్ పైన కన్నిళ్లని కలంగా మార్చి రాస్తున్న అక్షరాలు. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వేన్నముకలాంటివారు. అవినీతి ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సైనికులు, అలాంటి వారిని ఉపేక్షించడం సరి అయింది కాదు. ఆఖరికి జిల్లా కలెక్టర్ కు సైతం ఆర్జీ పెట్టుకుంటే స్పందించిన దాఖలాలు లేవంటే అధికారుల నిఘా నీడలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పకనే చెప్పవచ్చు. జర్నలిస్టులకు అందించే అక్రిడిటేషన్ కార్డుల జారీలో అవకతవకులకు తావివ్వకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు, అక్రిడిటేషన్ కార్డు,హెల్త్ కార్డు, జారీ చేయాలని సీనియర్ జర్నలిస్టులు కోరుతున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

janamvelugunews

Published

on

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

సిపి సాయి చైతన్య.

జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.

పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.

Continue Reading

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading