ARTICLE'S
ప్రతిపక్షాలను కాపాడుకోవడం ప్రజల కనీస బాధ్యత .


వడ్డేపల్లి మల్లేశము సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రముఖ రచయిత హుస్నాబాద్ .
జనం వెలుగు న్యూస్:- చట్టసదలలో ప్రతిపక్షాలు క్రియాశీలకంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజా సమస్యల పైన చర్చ జరుగుతుందని అలాంటి ప్రతిపక్షాలను చట్టసభలలో ఎన్నిక అయ్యే విధంగా ప్రజలు తీర్పునివ్వడం ద్వారా తమ సామాజిక బాధ్యత నిర్వహించాలని ప్రముఖ రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకులు వడ్డేపల్లి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ లో శనివారం రాత్రి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన సాహిత్య కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సిపిఐ పక్ష నేత చాడ వెంకట్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలు” అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం శాసనసభ ప్రసంగాలు ” పుస్తక ఆవిష్కరణ పరిచయ సభలో మాట్లాడుతూ ప్రజల పక్షాన పని చేయడానికి ప్రతిపక్ష నాయకుని పాత్ర గొప్ప అవకాశం అని ఆ బాధ్యతను సంతృప్తికరంగా నిర్వహించినారు అని చెప్పడానికి ఈ పుస్తకం పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు . ఈ సందర్భంగా వడ్డేపల్లి మల్లేశం మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాలను లేకుండా చేసి ఫిరాయింపులను ప్రోత్సహించి నిర్బంధం ప్రలోభాల నేపథ్యంలో ప్రశ్నించేవారు లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితోపలికారు. అంతో ఇంతో ప్రశ్నించగలిగే వామపక్షాలకు చట్టసభలో సభ్యులు లేరు కాంగ్రెస్ వారు చాలామంది ఫిరాయించబడిలో చేరినారు .ఇక ప్రశ్నించాలంటే సత్తా జ్ఞానము ఉండాలి కదా ప్రశ్నించే వాళ్ళు లేకుంటేనే తమ ఏకపక్ష పరిపాలన సజావుగా సాగుతుందని ఆలోచించినటువంటి తెరాస ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఇవ్వాలా చట్టసభలు దయనీయ స్థితిలో ఉన్నాయి .
నిరుద్యోగం పేదరికం రైతుల ఆత్మహత్యలు పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ విద్యా వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించడం ప్రైవేటు ఫీజులను అరికట్టడం ద్వారా మెరుగైన విద్య వైద్యాన్ని ప్రజలకు అందించడం వంటి అనేక అంశాల పైన చర్చకు తావు లేకుండా పోయినది ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం ఒకే వర్షాకాల సమావేశాలు కేవలం రెండు రోజులు మాత్రమే జరిగినవి అందులో ప్రతిపక్షాలను మాట్లాడించకుండా బహిష్కరించినటువంటి ఘనత ఈ తెరాస ప్రభుత్వానికి దక్కింది అలాంటప్పుడు బలమైన ప్రతిపక్ష నాయకులు సభలో ఉండడం చాలా అవసరం అని నేటి దుస్థితి వలన మనకు అర్థం అవుతున్నది. అందుకే ప్రజలారా ఓటర్లారా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా సమర్ధులను ఎన్నికల్లో గెలిపించుకోవడం ద్వారా ప్రజల సమస్యల పైన చర్చ జరిగే అవకాశం ఉంటుందని అప్పుడు మాత్రమే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు ఉండడం చాలా అవసరం అధికార పార్టీ ప్రలోభాలు మద్యం డబ్బు పంపిణీకి అలవాటు పడి బానిస మనస్తత్వంతో రాజు పడితే జీవితమంతా యాచకులుగా బతకాల్సిన వస్తుందని ఈ సందర్భంగా వడ్డేపల్లి మల్లేశం ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రాధాన్యతను ప్రతిపక్ష సభ్యులను కాపాడుకోవాల్సిన కర్తవ్యాన్ని సోదాహరణంగా వివరించడం ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో పుస్తక రచయిత మాజీ శాసనసభ్యులు చాలా వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, రామ్ కిషన్ రావు, పందుల శంకర్ , కౌన్సిలర్లు నలినదేవి, ఇతర కౌన్సిలర్లు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు .
–వడ్డేపల్లి మల్లేషము హుస్నాబాద్


ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.









