Helth
పల్స్ పోలియో చుక్కలు చిన్నా రులకు వరం


పల్స్ పోలియో చుక్కలు చిన్నా రులకు వరం
జనం వెలుగు, దిలవార్పూర్:- బన్సపెల్లి కంజర్ మాయపూర్ సిర్గాపూర్ గ్రామలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమన్ని నిర్వహించారు. 0-5 ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేయించి మీ పిల్లలను పోలియో భారీ నుండి రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఆన్ ఎం ఆశ వర్కర్స్ అంగన్ వాడి టీచర్స్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Helth
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డులు


జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డులు
జనం వెలుగు, నిజామాబాద్:- జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యం పూర్తి భరోసా ఇస్తూ హెల్త్ కార్డు జారీ చేస్తామని ముందుకు రావడం ఎంతో ఆనందకరమని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి డాక్టర్ సుభాష్ అన్నారు.
మంగళవారం నగరంలోని వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఆధునిక హంగులతో అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యం ముందుకు రావడం జర్నలిస్టు మిత్రులకు శుభపరిణామమని పేర్కొన్నారు.
వెల్నెస్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందేలా ప్రత్యేక హెల్త్ కార్డు రూపంలో ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ హెల్త్ కార్డు ఆన్లైన్ ప్రక్రియలో అమలవుతూ, జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులు, పిల్లలకు కూడా చికిత్స పొందే అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఉచిత హెల్త్ కార్డు ద్వారా లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్ర చికిత్సలతో పాటు ఇతర వైద్య సేవలను కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
జర్నలిస్టు మిత్రులు ఈ వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకొని, ఆసుపత్రి యజమాన్యానికి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. హెల్త్ కార్డు విషయంలో జర్నలిస్టుల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పూర్తి భరోసా కల్పించేందుకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు పూర్తిస్థాయిలో సహకరిస్తారని హామీ ఇచ్చారు.
అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు జర్నలిస్టుల పక్షాన నిలిచిన వెల్నెస్ ఆసుపత్రి డైరెక్టర్లు అసద్ ఖాన్, సుమన్‌లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ఆంజనేయులు, సతీష్ గౌడ్, గోవిందరాజు, సందీప్ దేశ్ముఖ్, నరేందర్ స్వామి, ఈసీ సభ్యులు సితారే కృష్ణ, పొద్దుటూరు ప్రీతం రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పాపా ఖాన్, నయీమ్ కమర్ బాయ్, మహమ్మద్ గౌస్ బాయ్, వెల్నెస్ ఆసుపత్రి మేనేజర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Helth
మెగా వైద్య శిబిరం, రక్తదాన


మెగా వైద్య శిబిరం, రక్తదాన
జనం వెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూరు, గ్రామంలో సోమవారం ఫుడ్ సైన్స్ కాలేజ్, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రాయకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించరు. ఈ కార్యక్రమంలో 246 మంది రోగులను పరీక్షలు జరిపి అందరికీ బిపి షుగర్ టెస్టులతో పాటు అవసరమైన వారికి ఈసీజీ టెస్ట్లు, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఫుడ్ సైన్స్ కాలేజ్ వారి ఎన్ ఎస్ ఎస్ ఏడు రోజుల క్యాంప్ లో భాగంగా నిర్వహించడం జరిగిందాని. ఈ కార్యక్రమంలో ప్రతిభ హాస్పటల్ నిజామాబాద్ డాక్టర్ జ్యోష్ణ, లైఫ్ కేర్ హాస్పిటల్ బోధన్ డాక్టర్ ఇర్ఫాన్ అలి, లైన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ తహసీన్ తదితరులు పాల్గొన్ని ఉచితంగా చికిత్సలను అందించారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారిచే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అందులోభాగంగా 21 మంది విద్యార్థులు, ఫుడ్ సైన్స్ కాలేజ్ సిబ్బంది వారి రక్తాన్ని దానం చేసారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ డాక్టర్ కల్పన అసోసియేట్ డీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ జె సాయి ప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ సంరీన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వారి సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ డాక్టర్ శ్యాంసుందర్ పహాడే సభ్యులు లయన్ తుక్కి మహేందర్ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Helth
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు


లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జనంవెలుగు, నిజామాబాద్ ఏప్రిల్ 25 : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీ సిపిఎన్డిటి ఆక్ట్ (గర్భస్తపూర్వ గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం) జిల్లాస్థాయి సలహా సంఘం సమావేశం డిఎంహెచ్ఓ కార్యాలయం లోని డిఎం అండ్ హెచ్ ఓ చాంబర్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుదర్శనం మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సమాఖ్య మొదలగు వారి ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని సమావేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై, లింగ సమానత్వము, లింగ వివక్ష , బేటి బచావో బేటి పడావో పై అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మహిళల కి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ల ద్వారా గృహ సందర్శనలో అమ్మఒడి కార్యక్రమంలో ఆడపిల్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం జరుగుతుంది. గత మీటింగ్ నుండి ఇప్పటివరకు వైద్య సిబ్బందికి, పర్యవేక్షక సిబ్బందికి డివిజన్ల వారీగా అవగాహన నిర్వహించడమే కాకుండా డిగ్రీ స్థాయిలో మహిళా కళాశాలలో పిసిపి ఎన్ డి టి ఆక్ట్ పై భేటీ బచావో భేటీ పడావో పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కన్వర్జేన్సీ లో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్స్, వివో ప్రసిడెంట్లకు అన్ని మండలాల్లో భేటీ బచావో బేటి పడావో, లింగ వివక్ష, లింగసమానత్వంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. న్యూ స్కానింగ్ సెంటర్స్ రిజిస్ట్రేషన్ కోసం మనకు మూడు, అదేవిధంగా రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం 11, అదేవిధంగా క్యాన్సలేషన్ ఆఫ్ స్కానింగ్ సెంటర్స్ గా మూడు చేయడం జరిగిందని, కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారి వారి అభిప్రాయాలని తెలియజేయడమే కాకుండా కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్స్ రోహిణి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శరణ్య, రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రావణి, పి ఓ డాక్టర్ వెంకటేష్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధా, స్వచ్ఛంద సేవా సంస్థ, ఆరోగ్య చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మెప్మా కల్పన, ఐసిడిఎస్ సౌమ్య, డెమో గంగాధర్, ఏవో చందర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.








