Connect with us

నిజామాబాద్

ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞత సభను విజయవంతం చేయండి

janamvelugunews

Published

on

మార్చి 12న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభను విజయవంతం చేయాలి

జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.యన్.చారి. ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.ఎల్.యన్. చారి. మాట్లాడుతూ, మార్చ్ 12 న, జరగబోయే సభను నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి గత ప్రభుత్వం ముమ్మాటికి తెలంగాణ ఉద్యమకారుల వ్యతిరేక శక్తిగానే చూస్తున్నామని అన్నారు. గత పది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి అస్తిత్వాన్ని కాపాడుతామని తెలంగాణ ఉద్యమకారుల గొంతుగా ముందుకు సాగుదామని ఉద్ఘాటించారు. జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులు గత ఆరు సంవత్సరాలుగా నిర్విరామ పోరాట ఫలితంగా 250 చదరపు గజాల భూమిని మన పోరాట ఫలితంగా సాధించుకున్నామని, న్యాయపరంగా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 25 వేల పెన్షన్ ఉచిత విద్య, వైద్యం, రవాణా సదుపాయం వంటి సౌకర్యాలు కల్పించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 250 చదరపు గజాల స్థలంతో పాటు పెన్షన్ సదుపాయం ఇతర సదుపాయాలన్నీ కల్పించి ఉద్యమకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. పూర్తి విశ్వాసం తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మార్చి 12న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో జరగబోయే ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞత సభకు వేలాదిగా తరి రావలసినటువంటి బాధ్యత ఉద్యమకారులపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల సభ్యులు సీతర్ల సురేష్, గవాస్కర్, గడ్డం శ్రీనివాస్, గణేష్ , శేఖర్ గౌడ్, పాండు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

| nandipet ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం 

janamvelugunews

Published

on

ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం 

 జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడి శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పాలన సిబ్బంది హాజరయ్యారు,

ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, గ్యాస్ సిలిండర్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూయించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాప పాలన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం జరుపుకుంటున్నామన్నారు.

ప్రజాభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి మంచి ఫలితాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై ప్రజాపాలనలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి తక్షణమే

నిర్ణయం తీసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని, లబ్ధిదారులకు అధికారులకు వారధిగా ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్ ఐ, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

|nizamabad పనుల్లో వేగం పెంచాలి

janamvelugunews

Published

on

పనుల్లో వేగం పెంచాలి
* యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో గురువారం యుజిడి అనుసంధాన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్ లు ఇస్తున్నారన్నారు.

నగరవాసులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇంటి యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు చేసే బృందాలని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

|Armoor సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం

janamvelugunews

Published

on

సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం
జనం వెలుగు ఆర్మూర్:- నిన్న వెలువడిన సిబిఎస్ఇ 2025- 2026 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో విద్యార్థులు తమ స్వీయ అను భవాలను, అధ్యాపకుల కృషిని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏనుగు ప్రణతి 483/500 మార్కులతో ప్రథమ స్థానం, ముకుంద్ హర్షిణి 462/500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని (బెస్టాఫ్ 5 ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్) పొందినారు.

ఈ సందర్భం గా స్కూల్ ప్రిన్సిపాల్ డా. విజయ లక్ష్మి మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో స్ఫూర్తి వంత మైన ప్రణాళికను రూపొందించుకొని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

స్కూల్ కరెస్పాండెం ట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారవంతమైన నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో క్షత్రియ పాఠశాలను స్థా పించమని జరిగిందని అన్నాడు. ఇట్టి ఫలితాలకు విశేష కృషికి పాటుపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి అల్జా పూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, అధ్యాపాక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Continue Reading