Connect with us

నిజామాబాద్

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించాలి

janamvelugunews

Published

on

అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు కలెక్టర్ సూచన

జనం వెలుగు న్యూస్:- నిజామాబాద్,జిల్లాలో వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారుల బృందం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థితిగతులు, పాలనా స్వరూపం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, డివిజన్, జిల్లా స్థాయి కేంద్రాలుగా అధికార యంత్రాంగం పరిపాలన కొనసాగుతుందని వివరించారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున 70 నుండి 80 శాతం మంది ప్రజలు సాగు రంగంపైనే ఆధారపడి జీవనాలు సాగిస్తారని అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, అలీసాగర్ వంటి జలాశయాలతో పాటు జిల్లాలో 70 కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం కలిగి ఉన్న జీవనది గోదావరిని ఆధారంగా చేసుకుని వివిధ రకాల పంటలు సాగు చేస్తారని ట్రైనీ అధికారులకు వివరించారు. అత్యధిక విస్తీర్ణంలో వరి పంట పండిస్తారని, 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికందుతుందని అన్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లా వరి సాగులో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో కొనసాగుతోందన్నారు. అలాగే దేశంలోనే అత్యధికంగా పసుపు పంట సాగు కూడా ఈ జిల్లాలోనే సాగవుతుందని కలెక్టర్ తెలిపారు. సోయాబీన్, ఎర్రజొన్న, మొక్క జొన్న, ఇతర పప్పు దినుసులు వంటి పంటలను కూడా జిల్లా రైతాంగం పండిస్తుందని వివరించారు. సేద్యపు రంగానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని, దేశంలోనే మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అమలు చేస్తోందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు అన్నదాతకు ఆదరువుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తే, పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించబడుతోంది కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీలు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు హరితహారం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. వివిధ వర్గాల వారికి ఆసరా పథకం కింద పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తూ ప్రభుత్వం ఆలంబనగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు 2016 రూపాయల చొప్పున, దివ్యాన్గులకు 3016 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తోందన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు మూడు లక్షల మందికి ప్రతీ నెల ఆసరా పెన్షన్ల కింద 17 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తోందని వివరించారు. గర్భిణీల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు ఎంతో సత్ఫలితాలు అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలోనూ ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అనేక రకాల పనులను చేపడుతూ, కూలీలకు ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు.

క్షేత్ర సందర్శనలో భాగంగా పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, ఉపాధి హామీ, మన ఊరు – మన బడి తదితర కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించి ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆయా పథకాల వాస్తవ అమలు పరిస్థితిని క్షేత్ర స్థాయి అధ్యయనం అనంతరం తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి సందేహాలు, సహాయ సహకారాలు అవసరమైనా, నేరుగా అధికారులను సంప్రదించవచ్చని అన్నారు. ఈ భేటీలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నోడల్ ఆఫీసర్ వసుంధర, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ గోవింద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ట్రైనీ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

janamvelugunews

Published

on

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు

నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,

డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.

చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.

Continue Reading