Connect with us

World

దేశమంతా విస్తరించిన రుతుపవనాలు

janamvelugunews

Published

on

దేశమంతా విస్తరించిన రుతుపవనాలు

జనంవెలుగు, హైదరాబాద్, జూలై 3:- తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి వస్తున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థిరమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 – 14 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. 77 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు జూలై 8 నాటికి విస్తరించాల్సి ఉండగా ఈ ఏడాది మాత్రం భిన్నంగా జూలై 2నాటికే విస్తరించాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపారు. అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

World

వరద బాధితులకు మేము సైతం

janamvelugunews

Published

on

వరద బాధితులకు మేము సైతం

తెలుగు జర్నలిస్టుల సంక్షేమసంగం

జనం వెలుగు, వెబ్ డెస్క్:- గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్నిఅతలా కుతలం చేసిన అతి పెద్ద వరదల్లో విజయవాడ వరద కూడా వచ్చి చేరింది.లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి.మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వాయనాడ్ బీభాత్సవం తెలియజేస్తే లేటెస్ట్ గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రాశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిస్సహాయులకు మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ముడు రోజులుగా,వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులు సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు. అటు జర్నలిస్ట్ ల కైనా ఇటు సామాన్య ప్రజలకైనా ఆపద వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుండే యూనియన్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంగం.. వరదల్లో చిక్కుకున్న బాధితులకు 5000వేల పులిహార ప్యాకెట్లు, మంచి నీళ్ళ బాటిల్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వరద నీటితో అంటురోగాలు, వ్యాధులు ప్రబలకుండా బాధితులకు హోమియోపతి రోగనిరోధక శక్తి బిళ్ళలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు జర్నలిస్టులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

World

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా

janamvelugunews

Published

on

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా

జనంవెలుగు, హైదరాబాద్:- దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం. కీలక తీర్పు వెలువ రించింది. వర్గీకరణ సమర్థ నీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది.2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిం చింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పంజాబ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం జస్టిస్ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. ఆ తీర్పును పున‌:సమీక్షిం చాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.

Continue Reading

World

ఆ పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం

janamvelugunews

Published

on

ఆ పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం

సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి మన మంగళ్ పాండే

-నేడు ఆయన జయంతి

జనంవెలుగు, విశ్లేషణ:- భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. అతడి పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం పుట్టించిన భారతదేశ సింహస్వప్నం. బహుశా ఈ తరం యువకులకు మంగల్‌ పాండే గురించి అంతగా తెలువకపోవచ్చు కానీ దేశ మొదటి స్వతంత్య్ర సంగ్రామంలో బొబ్బిలి పులిల పోరాడిన ధీరుడు. మంగల్‌ పాండే 19 జులై 1827న ఉత్తరప్ర దేశ్‌లోని నగ్వ గ్రామంలో దివాకర్‌, అభైరని పాండే లకు జన్మించాడు. 1857- 58 మధ్య కాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రా మంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్‌ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్‌ వారికి భారత పాలకులైన మొగలులు, పీష్వాల పట్ల నిర్లక్ష్య వైఖరి లాంటి రాజకీయ కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించారు. డౌహల్సి ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం లాంటివి ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఈనేపథ్యంలో బ్రిటిష్‌ వారు సిపాయిలను ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా 1857 మార్చ్‌ నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన సైనికుడు మంగల్‌ పాండే బ్రిటిష్‌ సార్జెంట్‌ మీద దాడిచేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. దానికి సార్జెంట్‌.. మంగల్‌ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి పాండేను బంధించాలని జమిందార్‌ను ఆజ్ఞాపించాడు. అతను కూడా జమిం దార్‌ ఆజ్ఞను తిరస్కరించాడం ద్వారా సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్‌ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. దీంతో మంగల్‌ పాండేను, జమిందార్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టుకొని ఏప్రిల్‌ 7న ఉరితీసింది. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్‌ లాంటి ధీరులు కూడా స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గౌరవార్ధం అప్పటి ప్రభుత్వం 1984లో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది.

Continue Reading