Connect with us

Education

రెగ్యులర్ వీసి స్టాప్ కావాలంటూ త్రిబుల్ ఐటీ బాసర విద్యార్థుల నిరసనలు

janamvelugunews

Published

on

రెగ్యులర్ వీసి స్టాప్ కావాలంటూ త్రిబుల్ ఐటీ బాసర విద్యార్థుల నిరసనలు

రెండవ రోజు కొనసాగుతున్న శాంతియుత నిరసనలు

రెగ్యులర్ వీసి, రిజిస్టర్, డైరెక్టర్, స్టాప్ లేక ఫెలైతున్న విద్యార్థులు!

సీఎం రేవంత్ రెడ్డి మాపై దయ చూపాలంటూ వేడుకోలు!

జనం వెలుగు, నిర్మల్:- గత కొన్నేళ్లుగా విద్య, వైద్యం ప్రజలకు అందక ఆవేదనకు గురివుతున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ భారత దేశ సమాజంలో బంగారు తెలంగాణ రాష్ట్రంలో చదువు కోసం, తిండి కోసం, అధ్యాపకుల కోసం అడుక్కోవలసిన పరిస్థితి నిర్మల్ జిల్లా ముదోల్ నియోజక వర్గం బాసర సరస్వతి అమ్మవారి త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో నెలకొంది. వివరాల్లోకి వెళితే, గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేద గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ విద్యార్థినీ విద్యార్థుల కోసం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ త్రిబుల్ ఐటీ బాసర యూనివర్సిటీని స్థాపించారు. ఆయన ఉన్నన్ని రోజులు కొన్ని సంవత్సరాలపాటు దేశంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా విద్యార్థినీ విద్యార్థులు తయారయ్యారు. కానీ పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాలు విద్యార్థినీ, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ విద్యార్థినీ విద్యార్థుల నివాసం కోసం 15 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన రేకుల షెడ్లు అతి ప్రమాదకరంగా విద్యార్థుల ఆవాసం ఉండేవని, అప్పటి పేరెంట్స్ కమిటీ పోరాటాల మేరకు అక్కడి నుండి విద్యార్థులను పక్కా బిల్డింగ్ లోకి మార్చడం జరిగిందని, అన్నం, కూరల్లో బల్లులు, పురుగులు, కప్పలు వచ్చిన విషయం ఈ విదితమే.చదువుకోవడానికి ఆరకోర వసతులు, రెగ్యులర్ వైస్ ఛాన్స్ లార్,డైరెక్టర్ గాని రిజిస్టర్ గాని ఉండరు,రెగ్యులర్ ప్రొఫెసర్స్ లేరు మరి చదువుకునేది ఎలా అంటే దాదాపు 9 వేల మంది విద్యార్థిని విద్యార్థులకు కేవలం 9 మంది కూడా రెగ్యులర్ స్టాప్ లేక సుమారుగా 200 నుంచి 300 మంది ప్రైవేట్ అధ్యాపకులతో తో గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. దాని ఫలితంగా పిల్లలు క్వాలిఫైడ్ స్టాప్ లేక ఎన్నో సబ్జెక్ట్స్ ఫెయిలవుతూ,అతి కష్టంగా యూట్యూబ్లో లెసన్స్ వింటూ అతి కష్టం మీద పిల్లలు చదువును కష్టకాలంగా ముందుకు కొనసాగిస్తున్నారు. 2023 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారం రోజులపాటు విద్యార్థిని విద్యార్థులు ఎండనక వాననక శాంతియుత నిరసనలు చేసి యావత్ ప్రపంచం వారెవా అనేటట్లు శాంతియుత నిరసనలు చేశారు. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వెళ్లి మూడు నెలల్లో మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అసెంబ్లీలో వదంతులు చెప్పి, కాల యపాలన చేశారు. చివరికి ఆ ప్రభుత్వం పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆరోజు ఎడ్ల బండి మీద విద్యార్థిని విద్యార్థులను కలిసి, అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి తొమ్మిది నెలలు గావస్తున్న ఎందుకు రెగ్యులర్ వీసి, రిజిస్టర్ , డైరెక్టర్,స్టాప్ ఏర్పాటు చేయలేకపోతున్నారని పిల్లలు ,తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్ జి సి) స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సాయంత్రం గంటపాటు శాంతియుత నిరసనలు తెలియజేస్తూ వియ్ వాంట్ జస్టిస్, వి వాంట్ రెగ్యులర్ వీసి అండ్ స్టాఫ్ అంటూ నినాదాలు చేసుకుంటూ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ ఆ విద్యార్థిని విద్యార్థుల ఘోస ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గాని ప్రభుత్వానికి గాని పట్టడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి మండలి, నిర్మల్ జిల్లా కలెక్టర్, డి ఈ ఓ, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పట్టించుకొని, మా జీవితాలను బాగుపరచాలని మాకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్, డైరెక్టర్, అధ్యాపకులను వెంటనే ఏర్పాటు చేయాలని పిల్లలు కోరుతున్నారు. లేనిపక్షంలో మళ్లీ 24 గంటల ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని (ఎస్ జి సి) స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వన్ని హెచ్చరించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి

janamvelugunews

Published

on

భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.

సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.

కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

Education

| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు

janamvelugunews

Published

on

పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు

జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది.  విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Crime

రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి

janamvelugunews

Published

on

రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.

Continue Reading