భక్తి
వినాయక మండపంలో ప్రత్యేక పూజలు, విరాళాలు


వినాయక మండపంలో ప్రత్యేక పూజలు
జనం వెలుగు, చిలిపిచేడ్ :- మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చిట్కుల్, బద్రియ తండ గ్రామాలలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రెండు గ్రామాలలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. వివిధ మండపాలకు తన వంతుగా విరాళాలను అందజేశారు. భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తారా విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు వెంకటరెడ్డి, మైనార్టీ యువ నాయకులు ఎండి అఖిల్, మాన్య నాయక్, రెడ్యానాయక్, కాట్రోత్ కూన్య. కైలాష్, రాజశేఖర్ నాయక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
నేను అనునది తెలుసుకో…


గీత భక్త జనాశ్రమం కిసాన్ నగర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వామి.
జనం వెలుగు బాల్కొండ:- నేను అనునది తెలుసుకోవడానికే గురువు ఆశ్రయించాల్సిన అవసరం ఉందని గీతా భక్తాజనాశ్రమం కిసాన్ నగర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వామి అన్నాడు. మండల కేంద్రమైన బాల్కొండ పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యానంద స్వామి ఆశ్రమంలో ఆదివారం నిర్వహించిన 495వ సంచార సత్సంగంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు. తాను చేసిన సంపాదనలో 10 శాతం దానధర్మాలను చేయాలని, వాటి ద్వారా పూర్వ జన్మలో తెలిసో తెలి యకో చేసుకున్న పాపాలను కొంత మేరకు కడిగి వేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపాడు.
అన్ని జన్మలలో కెల్లా మానవ శ్రేష్టమై నదని ఈ మానవ జన్మ ద్వారానే జనన మరణ బంధనాలను త్రెంచు కొని, జనన, మరణ చక్రాల బంధనాల నుండి విముక్తి పొందే అవకాశం ఈ ఒక్క జన్మకే ఉందని ఆయన తెలిపాడు. రాగద్వేషాల వలన మనుజుడు అధోగతి పాలవుతాడని, ప్రతీ కారం తీర్చుకోవాలని తపనతో ఉన్న వ్యక్తి జీవితంలో ఏమి సాధించ లేక అన్ని కోల్పోయి దుర్భరమైన జీవితం గడపాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు.
త్యాగం వలన శాంతి లభిస్తుందని అప్పుడే అమర త్వాన్ని పొందుతామని, ఆత్మ సాక్షా త్కారం పొందేందుకే ఈ మానవ జన్మ ఆయన వివరించాడు. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెటుపల్లి, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్ తథితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ విరజానంధ స్వామి, శ్రీ విశోఖ తీర్థ స్వామి, మాతా పరమేశ్వరి, మాతా సూరతా నందితా తదితరులు ప్రవచించారు.
నిజామాబాద్
బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్


బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
జనం వెలుగు, నిజామాబాద్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ పర్యవేక్షించారు.
ఉప ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు జరగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ బందోబస్తు ఏర్పాట్లలో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితె, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
అట్టహాసంగా దుర్గాదేవి నిమజ్జన శోభా యాత్ర




అట్టహాసంగా దుర్గాదేవి నిమజ్జన శోభా యాత్ర
జనంవెలుగు, నిజామాబాద్: శరన్నవరాత్రుల సందర్భంగా గాజులపేట్ ప్రాంతంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. గాజులపేట్ యూత్ ఆధ్వర్యంలో ఖిల్లా రోడ్ మున్నూరు కాపు సంఘం ముందు ప్రతిష్టించిన అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వైభవంగా అలంకరించి పూజించారు. ప్రతి రోజు భిన్న అలంకారాలతో, ప్రముఖ పురోహితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల మధ్య దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా గాజులపేట్ యూత్ సభ్యులు జనం వెలుగు ప్రతినిధి తమ్మలి పాండుతో మాట్లాడుతూ, “ఇది 18వ సంవత్సరం అమ్మవారిని ప్రతిష్టించడం. ప్రతి సంవత్సరం గాజులపేట్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు” అని తెలిపారు. శనివారం నిర్వహించిన నిమజ్జన శోభా యాత్రలో రంగురంగుల అలంకరణలు, లైట్లు, డీజే సంగీతం, డ్రోన్ కెమెరాతో చిత్రీకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తి, ఆనందం, ఉత్సాహంతో నిండిన వాతావరణంలో గాజులపేట్ ప్రజలు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానికులు యూత్ సభ్యుల సమన్వయం, భక్తి ఉత్సాహాన్ని ప్రశంసించారు.








