Connect with us

నిజామాబాద్

కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వగలరు

janamvelugunews

Published

on

కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వగలరు

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండల కేంద్రంలో ఆదివాసీల స్ఫూర్తి ప్రదాత, పొరటయోధుడు కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు అనుమతిని ఇప్పించగలరని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నాయకపోడు సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ జిల్లా ఉపాధ్యక్షులు దాత్రిక్ అంజయ్య, కావాలికాడి పోశెట్టి, అన్నం సాయిలు, కొండ శ్రీనివాస్ నందిపేట్ మండలం అధ్యక్షుడు మన్నే సాగర్ ఉపాధ్యక్షులు మెరేడు రవి, గంట సాగర్ తదితరులు ఉన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

టి జి ఎస్ ఆర్ టి సి నూతన రీజినల్ మేనేజర్ గా ఎస్ వి జి కె మూర్తి

janamvelugunews

Published

on

టి జి ఎస్ ఆర్ టి సి నూతన రీజినల్ మేనేజర్ గా ఎస్ వి జి కె మూర్తి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన రీజినల్ మేనేజర్.

నిజామాబాద్ రీజియన్ నూతన రీజినల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్విజీకే మూర్తి కి, డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి కి డిప్యూటీ రీజినల్ మేనేజర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆరు డిపోల డిపో మేనేజర్లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు మరియు రీజియన్ కార్యాలయ అధికారులు పాల్గొని నూతన రీజినల్ మేనేజర్ కుశుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నూతన రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలో కొత్త బస్సు మార్గాల అవసరం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు ప్రజా రవాణాసౌకర్యాల విస్తరణ,ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, విద్యార్థులు,ఉద్యోగులు మరియు సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన బస్సు సేవల కల్పన వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సు మార్గాల ప్రతిపాదనలు, ప్రయాణికుల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు సర్వీసుల నిర్వహణ, ఆర్టీసీ సేవలను మరింత ప్రజలకు చేరువ చేసే చర్యలపై రీజినల్ మేనేజర్ ఎస్విజీకే మూర్తి హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ అధికారులు, ఎంపీవోలు మరియు సంబంధిత శాఖల అధికారులుపాల్గొన్నారు.జిల్లా ప్రజలకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన, నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉందని రీజినల్ మేనేజర్ ఎస్వీజీకే మూర్తి తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర

janamvelugunews

Published

on

నందిపేటలో జరగనున్న పూరి జగన్నాథ రథయాత్ర

జూన్ 10 జనం వెలుగు: నందిపేట మండల కేంద్రంలో జులై 22వ తేదీన కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరగనుందని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద రాములు మహారాజ్ కోరారు.

   ఈ సందర్భంగా, కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు మాట్లాడుతూ పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర కనివిని ఎరుగని రీతిలో ఇసికేస్తే రాలనంత జనాలతో హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అంటూ ఆధ్యాత్మిక నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుందని,

    కొందరు ప్రత్యక్షంగా చూసి ఆ జగన్నాథని ఆశీస్సులు పొందుతే,,, మరికొందరు టీవీలలో చూసి తన్మయం చెందుతారని అన్నారు. అంత దూరం వెళ్ళని వారి కొరకు వారి వారి ప్రాంతాల ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

    అందులో భాగంగానే జులై 22న నందిపేట మండల కేంద్రం లోని వివేకానంద చౌరస్తా నుండి సాయంత్రం 6 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని, చాకలి ఐలమ్మ, అంబేద్కర్, నంది, బస్టాండ్ మెయిన్ రోడ్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సుభాష్ గల్లి సుభాష్ చంద్రబోస్,

    గాంధీనగర్ గాంధీ చౌరస్తాలా విగ్రహాల మీదుగా నాగమంతెన ఫంక్షన్ హాల్ వరకు సాగుతుందని, ఫంక్షన్ హాల్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర ముగుస్తుందని, ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు జాతి మత భేదాలు లేకుండా పెద్ద ఎత్తున రథయాత్రలో పాల్గొని ఎవరైతే

    ఆ రథాన్ని లాగుతారో వారికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు అందుతాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు, కృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

టీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎంకు ఘన వీడ్కోలు సన్మానం

janamvelugunews

Published

on

టీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎంకు ఘన వీడ్కోలు సన్మానం

జనం వెలుగు, నిజామాబాద్: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోత్స్న బదిలీపై నల్గొండకు వెళ్తున్న సందర్భంగా, డిప్యూటీ రీజియన్ మేనేజర్ మధుసూదన్ మెదక్ రీజియన్ మేనేజర్‌గా పదోన్నతితో బదిలీ అయిన సందర్భంగా నిజామాబాద్ రీజియన్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్‌కు చెందిన డిపో మేనేజర్లు ఆనంద్, సాయన్న, దినేష్, సూపర్వైజర్లు, మెకానికల్ ఫోర్‌మెన్లు, రీజియన్ పర్సనల్ ఆఫీసర్ పద్మజ, రీజియన్ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా సన్మానించారు.

సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన టి. జ్యోత్స్న, నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులందరూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే మెదక్ రీజియన్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మధుసూదన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

డిపో-1 మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ, బస్సు షెడ్యూళ్లు పెరిగినప్పటికీ సమర్థవంతమైన నిర్వహణతో డిపోను ముందంజలో నిలపడానికి అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ డిపో-2ను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపిన డిపో మేనేజర్ సాయన్నను ప్రత్యేకంగా అభినందించారు.

సన్మానానికి స్పందించిన అధికారులు తమ సేవా కాలంలో సహకరించిన ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధికి అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ పద్మజ, పీఆర్‌ఓ రాజేందర్, ఆర్‌ఎం కార్యాలయ సిబ్బంది ఆనంద్, మహేష్, సత్యనారాయణ, డిపో-1 సూపరింటెండెంట్ శ్రీలత, మెకానికల్ ఫోర్‌మన్ వసుందర, సీఐ జనాబాయి, బస్‌స్టేషన్ మేనేజర్ శివరాజమ్మ, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.

Continue Reading