Connect with us

ARTICLE'S

అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఇంకెన్నాళ్లు కావాలి ?

janamvelugunews

Published

on

అక్రిడిటేషన్ జారీలో తీవ్ర అలసత్వం, ప్రజా పాలన అంటే ఇదేనా: గౌటి రామకృష్ణ

మీడియా అకాడమీ, ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మండిపాటు

కొత్త కార్డుల జారీకి ఇంకెన్నాళ్లు కావాలి ?

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధి ఎంత ? ఖర్చు చేసింది ఎంత ? మిగిలింది ఎంత ?

వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని టిజేఎస్ఎస్ డిమాండ్

కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్లు ఉన్నాయా లేక హాంఫట్ అయ్యాయా ?

అనారోగ్యానికి, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ?

ప్రతి జిల్లాలో డిపిఆర్ఓ సమక్షంలో రాత పరీక్షలు నిర్వహించి జర్నలిస్టులకు శాశ్వత అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

గత ప్రభుత్వంలో జర్నలిస్టులను నిర్లక్ష్యం చేశారనే ప్రభుత్వాన్ని మార్చాం

కొత్త ప్రెస్ అకాడమీ చైర్మన్ గత సర్కారు విధానాలను, అల్లం నారాయణ పద్ధతులనే కొనసాగిస్తున్నారా ?

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనూ జర్నలిస్టులకు ఆరోగ్య, భద్రత ఉద్యోగ భద్రత లేదు

పాత్రికేయుల సమస్యలు తీరేవరకు పోరాటం ఆగదు : తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం

జనంవెలుగు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే అక్రెడిటేషన్ కార్డులు ఇంకా ఎంత కాలం పొడిగిస్తారని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం మండిపడింది. ఇప్పటికే అనేక దఫాలుగా 3 నెలల చొప్పున పొడిగించుకుంటూ కాలం వెళ్లదీశారు అని సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని , మరోసారి పాత కార్డులను పొడిగించడం అంటే నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు హ్యాండ్ ఇవ్వడమే అని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమిచ్చే గుర్తింపు కార్డులు పక్కదారికి పట్టకుండా పటిష్ట ప్లాన్ సిద్ధం చేసి 2 నెలల్లో రాష్ట్రంలోని జర్నలిస్టు అందరికీ అందించాలని ఇప్పటికే ఎన్నో సార్లు ఐ అండ్ పిఆర్ కమిషనర్, ప్రెస్ అకాడమీ చైర్మన్’కి విజ్ఞప్తి చేశామన్నారు. అయినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఉన్న లోపభూయిష్టమైన విధివిధానాలను, కాంగ్రెస్ హయాంలో కఠినతరం చేస్తూ డిగ్రీ పాసైన వాళ్లకు డిపి ఆర్ఓల సమక్షంలో రాత పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ పద్ధతిలోనే అసలైన జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తే సరిపోయే దానికి నెలలు నెలలు పొడిగించుకుంటూ పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం , ప్రెస్ అకాడమీ చర్యలతో పాత్రికేయులు విస్మయం చెందుతున్నారని రామకృష్ణ అన్నారు.

గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రాజ్యం ఏలిన అల్లం నారాయణ జర్నలిస్టు వ్యవస్థను అధోగతి పాలు చేశారని, ఆనాటి సీఎం కెసిఆర్ జర్నలిస్టు సంక్షేమం కోసం ఇచ్చిన రూ.100 కోట్ల ఫండ్ ఏమైందో పాత్రికేయులకు వివరించాలన్నారు.

ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి రూ.100 కోట్లలో ఎంత డబ్బు ఉందో, ఇప్పటికీ ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం ద్వారా చెప్పాలని కోరారు. లేకుంటే ఏరి కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వంపై సమాజంలో తప్పుడు అభిప్రాయం కలుగుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధి పూర్తిగా పక్కదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నా, ప్రెస్ అకాడమీ నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో జర్నలిస్టు మిత్రులు అర్థం చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, జర్నలిస్టుల బతుకుల్లో ఎలాంటి మార్పు తేలేకపోయిందని మండిపడ్డారు.

అనారోగ్యంతో ఆసుపత్రిల పాలైన జర్నలిస్టులకు కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆసుపత్రి ఖర్చులను పూర్తిగా తిరిగి అందించాలని ఒక మంత్రి కానీ, ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ, కమీషనర్ కానీ ఇప్పటివరకు ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

రేవంత్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను పూర్తి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, ఇది ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.

గడిచిన సంవత్సర కాలంలో కేవలం విధివిధానాలను ఖరారు చేయడానికి కూడా చేతకాకపోతే అధికార యంత్రాంగం ఏం పని చేస్తోందో ప్రజలకు, పాత్రికేయులకు అర్థం అవుతుందన్నారు.

జర్నలిజం ప్రవేశ విద్య అభ్యసించిన వారికి డిగ్రీ పాసైనవారికి జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి వ్యక్తికి వారి జిల్లా పరిధిలో ఉన్న డిపిఆర్వోల సమక్షంలో రాత పరీక్ష నిర్వహించి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో అక్రిడేషన్ కార్డులను అంగట్లో సరుకులను అమ్ముకున్నట్లు అమ్ముకుని, దుర్వినియోగం అవుతాయని హెచ్చరించారు. ఎలాంటి అర్హత లేని వాళ్లకు 20వేల నుండి 50 వేల వరకు అమ్ముకొని పత్రిక యజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయని జనరల్ సెక్రెటరీ గౌటి రామకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిత్తశుద్ధి వైఖరితో అక్రిడేషన్ కార్డులను జారీ చేయడంతోపాటు వాళ్లకు జారీ చేసే హెల్త్ కార్డులు ప్రతి ఆసుపత్రిలో ఉపయోగపడే విధంగా ఇవ్వాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆసుపత్రి ఖర్చులను పూర్తిగా భరించాలని గౌటి రామకృష్ణ కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading