Connect with us

నిజామాబాద్

సంక్రాంతి పండుగ సందర్భంగా జాగ్రత్తలు పాటించండి: భీంగల్ ఎస్సై మహేష్

janamvelugunews

Published

on

సంక్రాంతి పండుగ సందర్భంగా జాగ్రత్తలు పాటించండి: భీంగల్ ఎస్సై మహేష్

జనంవెలుగు, భీంగల్, జనవరి 11: సంక్రాంతి పండుగ సందర్భంగా భీంగల్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల ప్రజలందరూ భద్రతా జాగ్రత్తలు పాటించాలని భీంగల్ ఎస్సై జి. మహేష్ సూచించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పండుగ సందర్భంలో ఇంటి భద్రత, ప్రయాణాలు, విలువైన వస్తువుల రక్షణ, అనుమానాస్పద వ్యక్తుల పై దృష్టి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని లేదా వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు లేదా పొరుగు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రయాణానికి ముందు ఇంట్లో ఒక రూములో లైట్ వెలిగించి ఉంచడం, తలుపులపై డోర్ కాటన్ ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చుట్టుపక్కల అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయగాథలకు జాతీయ వేదిక ” మన్ కీ బాత్ “

Thammali Pandu

Published

on

విజయగాథలకు జాతీయ వేదిక ” మన్ కీ బాత్ “

జనంవెలుగు నిజామాబాద్ : – సామాన్యుల విజయ గాథలకు జాతీయవేదికగా “మన్ కీ బాత్” నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

ఆదివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దేశ ప్రజలకు కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం కార్యక్రమ ప్రత్యేకత అని తెలిపారు.

12 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మన్ కీ బాత్ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఒక ఆత్మీయ వారధిగా నిలిచిందన్నారు.

ఈ ఎపిసోడ్ లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని పేర్కొన్నారు.

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.

అలాగే ఉత్తరాఖండ్‌లోని హేవల్ నదిని పునరుజ్జీవింపజేయడానికి స్థానిక ప్రజలు, అధికారులు కలిసి చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించడం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందన్నారు.

రాబోయే దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపు ప్రతి భారతీయుడు ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

“మన్ కీ బాత్’ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను కోట్లాది మందికి పరిచయం చేసే గొప్ప వేదిక అని కొనియాడారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ 

Thammali Pandu

Published

on

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ 

ర్యాలీ నిర్వహించిన అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో “సైకిల్, బైక్ ర్యాలీ ” కార్యక్రమం 

జనంవెలుగు నిజామాబాద్:– పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డి. సి. పి ( అడ్మిన్ ) ఎన్. శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సైకిల్, బైక్ ర్యాలీ ఉదయం 8 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి అదనపు పోలీస్ కమిషనర్ ఎన్. శుభం ప్రకాష్ జండాఊపి ప్రారంభించారు.

పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై, ర్యాలీ ప్రగతి హాస్పిటల్ – ఎల్ఐసి చౌరస్తా – కోర్టు చౌరస్తా – ఎన్టీఆర్ చౌరస్తా – పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు , మతపరమైన విభజన శక్తులు , ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాలు అరికట్టడం , మాదక ద్రవ్యాలు అణచివేయడానికి , మహిళ భద్రతకు , తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేటు లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని , ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న , వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు.

ఈ దేశం కోసం, న్యాయం కోసం , ఎప్పటికీ తలవంచకుండా పక్షపాతం లేకుండా , సేవ చేయడానికి మనస్ఫూర్తిగా ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి.ఐలు , రిజర్వు ఇన్స్ పెక్టర్లు , ఎస్.ఐలు , ఆర్.ఎస్.ఐలు , ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది , స్పెషల్ పార్టీ సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Thammali Pandu

Published

on

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

జనంవెలుగు నిజామాబాద్ :- రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు.

పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలిజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీ.ఎస్ సంజయ్ జాజు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అనుసంధానం, నిధుల విడుదల ప్రక్రియపై చర్చించారు.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించడానికి పోలీస్ ఆమోదిత కేసులకు గరిష్టంగా లక్షా 50 వేల రూపాయల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రమాదం తర్వాత బాదితుల ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఈ సమయంలో వేగంగా స్పందించాలని అన్నారు. ఈ పథకం సమర్థవంతమైన అమలు కోసం జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలతో సమన్వయం చేసుకొని, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

          ప్రమాదాల నివారణకు, బాధితుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయడానికి టీఎంఎస్ 2.0 పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బాధితుల చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రజలలో ఈ పథకంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ పథకం అమలును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు.

        వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు పలు సూచనలు చేశారు. పీఎం రాహత్ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత శాఖలు వెంటనే అప్రమత్తమవ్వాలని అన్నారు.

నగదు, బాదితుల సమాచారం అందుబాటులో లేని కారణంగా వైద్యసేవలు నిరాకరించకూడదన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఉండి ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టాలను తగ్గించాలని తెలిపారు.

       ఈ వీసీలో అదనపు కలెక్టర్ లు రాజాగౌడ్, భుజంగరావు, జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్, వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈ-దార్ జిల్లా మేనేజర్ వర్ష నిహంత్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading