Connect with us

ARTICLE'S

ఓట్ల బలం ఉన్నప్పుడు సీట్లు మావి

janamvelugunews

Published

on

*బీసీ వాదం బలపడడానికి వేదికైనా ఎమ్మెల్సీ ఎన్నికలు
*రాజకీయ పార్టీల పునాదులను పెకిలించే భూకంపాలు
*సామాజిక న్యాయం ఎండమావి కాకూడదు
*ఓట్ల బలం ఉన్నప్పుడు సీట్లు మావి అని నిరూపించాలి

జనంవెలుగు, వెబ్డెస్క్:- వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానానికి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ స్థానానికి అటు ఉపాధ్యాయుల ఇటు పట్టభద్రుల ఎన్నిక ప్రచారం ప్రసంగాలపర్వం ఉపాధ్యాయులను పట్టభద్రులతో పాటు సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులను విద్యార్థులను కూడా ఆలోచింపచేసినది. గతంలో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలు ఇతర ఏ వర్గానికి కూడా అంతగా తెలిసేవి కాదు కానీ ఇటీవల రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ మేరకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఇస్తామని అందుకు సంబంధించి కులగనన చేసి బిల్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు జరిగిన కుల గణన పైన పెను దుమారం చెలరేగినది. బయటికి ప్రకటించకపోయినప్పటికీ 2014లో కెసిఆర్ నిర్వహించిన ఒకరోజు సర్వేలో బీసీలు 51% గా నమోదైతే ప్రస్తుత ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో 46% మాత్రమే బీసీలు ఉన్నట్లు లెక్క తేలడం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. బీసీ మేధావుల సంఘం బీసీ సంక్షేమ సంఘాలు ఇతర మేధావులు పార్టీలకతీతంగా రాజకీయ పక్షాల నాయకులు విశ్లేషకులు ఈ లెక్కలు తప్పుల తడక అని, చేసిన సర్వేలో లోపాలు ఉన్నాయని, తిరిగి నిర్వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జనంలో పెద్ద ప్రచారం చెలరేగడానికి కారణమైంది. ఇదే సందర్భంలో మూడు స్థానాలకు సంబంధించి ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితా ఆ సందర్భంగా జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలు బిసి సంక్షేమ సంఘం తీసుకున్నటువంటి కొన్ని అనుకూలమైన నిర్ణయాల వలన ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ స్థానానికి పట్టభద్రుల సమరంలో ఓసి బిసి వర్గాల మధ్యన చలరే గుతున్నటువంటి ప్రచ్చన్న యుద్ధం కూడా బీసీ వాదాన్ని సవాల్గా తీసుకోవడానికి కారణమైనది.

ఒకవైపు విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి, పట్టబద్రుల స్థానానికి, మల్క కొమురయ్య ఉపాధ్యాయ స్థానానికి పోటీలో ఉండడం ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ రంగాలకు తీరని ద్రోహం జరుగుతుందని ఆగ్రహం ఒకవైపు ఉంటే మరొకవైపు బీసీ వర్గానికి చెందినప్పటికీ మల్క కొమురయ్య ఉపాధ్యాయ స్థానానికి పోటీలో నిలవ డాన్ని పెట్టుబడిదారీ వర్గానికి ప్రతినిధిగా ప్రజలు అంగీకరించే స్థితిలో లేకపోవడం కూడా ఆలోచించాలి. అంటే బీసీ వాదం బలపడుతూనే పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేట్ రంగాన్ని బీసీలు అనుమతించరు, ప్రభుత్వ రంగంలోనే విద్య వైద్యము సామాజిక న్యాయము అన్ని రకాల వ్యవస్థలు కొనసాగాలని కోరుకుంటున్నారు అనడానికి ఈ ఆలోచన నిదర్శనంగా భావించాలి. బీసీ మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్త ప్రకటన ద్వారా మూడు స్థానాలలో నిలబడుతున్నటువంటి బీసీ అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా బహిరంగ ప్రకటన చేసి ఉన్నారు. అదే సందర్భంలో అక్కడ ఇంకా మిగిలిపోయినటువంటి బీసీ కార్యకర్తలు లేదా అభ్యర్థులు ఉంటే మిగతా ప్రాధాన్యత ఓట్లను వారికి కూడా వేయడం ద్వారా ఓటర్లు తమ యొక్క చాకచక్యాన్ని సమయస్ఫూర్తిని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా బీసీ వాదాన్ని మరింత ముమ్మరం చేయడానికి ఓసీలను ఓడించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పటికే రాష్ట్ర శాసనసభ శాసనమండలిలో ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి రెడ్డిలు రావులు ఎక్కువ సంఖ్యలో కొనసాగుతున్న సందర్భంలో ముఖ్యంగా కాంగ్రెస్ బిజెపి లాంటి పార్టీలు బీసీలను కాదని ఆధిపత్య కులాలకే అభ్యర్థిత్వం కేటాయించడం బీసీ వర్గాలకు తీరని ద్రోహంకాగా దీనిని సవాలుగా తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉద్యోగులు, బీసీ వర్గాలు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని సైతం ఆలోచింప చేసే విధంగా తమ శక్తియుక్తులను ధారబోసి బీసీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరొక్కవైపు బీసీ అభ్యర్థులలో డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఉపాధ్యాయ రంగంలో వై అశోక్ కుమార్ ముత్తారం నరసింహస్వామి వంటి బీసీ వాదులు ఉద్యమ నేపథ్యం కలిగి సమస్యల మీద అవగాహనతో పాటు ప్రతి ఉత్తర్వును వివరించగలిగిన సత్తా ఉన్న వాళ్లను ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వ రంగంలో విద్యను కాపాడుకోవడానికి, విద్యారంగానికి హెచ్చు నిధులను కేటాయించడానికి, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడానికి, నిరుద్యోగ యువతకు కొలువుల కొట్లాటకు వీలుంటుంది. పెట్టుబడుదారి వర్గాలను ఎన్నుకుంటే వాళ్లు ప్రభుత్వ రంగ బలోపేతం కోసం కృషి చేస్తారా ?ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారిని పోటీలో దించినదో అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వ్యవస్థ 60 శాతం ఆక్రమించి ప్రభుత్వ రంగం కునారిల్లిపోయిన దయనీయస్థితిలో ప్రైవేటు వ్యవస్థను మొత్తం కూలదోసి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించే విధంగా వివక్షతకు తావులేని పద్ధతిలో ఉండాల్సిన నాణ్యమైన ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలకు ఈ చర్య పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నది. మరొకవైపు బీసీ వర్గాలు అంటే పేదవాళ్ళని, డబ్బు లేనందున వాళ్లకు టిక్కెట్టు ఇవ్వలేదని, టికెట్ ఇచ్చిన గెలవలేరని, అందుకోసమే తమ కులాలకు చెందిన వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తే గెలుస్తున్నారని నమ్మలికే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అంటే సంపన్నులు పెత్తందారీ వర్గాలు భూస్వాములకే నా ఈ రాజ్యాన్ని పాలించే హక్కు? మేమెంతో మాకు అంత అనే నేపథ్యంలో బీసీ వాదులు పోరాటం చేస్తున్నారు తమకు ఉన్నటువంటి మేధో పరిజ్ఞానంతో సామాజిక అవగాహన ప్రభుత్వ రంగం పైన బాధ్యతతో ఒక్కొక్కరూ తమ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సామాజిక సేవకు తరలివస్తున్నారు అందులో ప్రసన్న హరికృష్ణ ఒకరు కాదా!
జనాభాలో ఆయా సామాజిక వర్గాలకు వారి వాటా మేరకు అన్ని రంగాల్లోనూ న్యాయం దక్కాలి ప్రధానంగా రాజ్యాధికారం అనే అంశంలో బీసీలకు వాటా దక్కకుండా ఉంటే ఆధిపత్య వర్గాలు మరెoతో కాలం స్వారీ చేయడానికి వెనుకాడవు.

ఎందుకంటే వాళ్లకు సామాజిక న్యాయం చేయాలి అనే సోయి ఉండదు. ఉదాహరణకు 2.4 శాతం ఉన్నటువంటి రెడ్డి వర్గానికి ఈ రాష్ట్రంలో 43 మంది శాసనసభ్యులు ఉన్నారు అయినప్పటికీ శాసనమండలిలో కూడా వదిలిపెట్టకుండా అదే వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇచ్చి బీసీల ఆగ్రహానికి గురైన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉందా. రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సామాజిక న్యాయం ఎండమావి కాకూడదు. డబ్బుకు సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించగలిగితే మేధస్సు, అవగాహన, సామాజిక చింతన అంశాల్లో పోటీ కొనసాగినట్లయితే కచ్చితంగా బీసీ వర్గాలు ముందు వరుసలో ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. ఆ వైపుగా ఎన్నికల సంఘం కూడా తగిన మార్పులు నిబంధనలు రూపొందించాలి అదే సందర్భంలో మెజారిటీ 60 శాతం ఉన్న బీసీ వర్గాలు ఓట్లను తమ అభ్యర్థులకే వేసుకోవడం ద్వారా నిరంతరం ఆధిపత్యం చలాయించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్రవర్ణాల కుట్రలను చేదిస్తే భవిష్యత్తు అంతా బీసీలదే. రాజ్యాధికారాన్ని అనుభవించడానికి, వాటాను తమ వర్గాలకు అందించడానికి కాంక్ష ఉండాలి. కాంక్ష, ఆత్మాభిమానం ముందు డబ్బు ఓడిపోవాల్సిందే. అందుకే ప్రసన్న హరికృష్ణ, వై అశోక్ కుమార్, ముత్తారం నరసింహస్వామి వంటి వాళ్లందరూ ఆత్మగౌరవంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ ఎన్నికల ద్వారానైనా బిసి ప్రజానీకం మేధావులు బుద్ధి జీవులు ఓటర్లు పట్టబదృలు ఉపాధ్యాయులు తమ బాధ్యతను గుర్తించి తప్పిదాలను సవరించుకొని 60 శాతంగా ఉన్న మెజారిటీ వర్గందే రాజ్యమని రుజువు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు వేదికైన ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా మనలను ఒకటి చేయడం సర్వదా అభినందనీయం.

ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading