నిజామాబాద్
నిత్యావసర సరుకుల పంపిణీ శివాజీ బ్లడ్ గ్రూప్ సభ్యులు


నిత్యావసర సరుకుల పంపిణీ శివాజీ బ్లడ్ గ్రూప్ సభ్యులు
జనంవెలుగు, బోధన్: బోధన్ పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబానికి శివాజీ బ్లడ్ గ్రూప్ సభ్యులు సహాయహస్తం అందించారు. నసీర్ ఖాన్ అనే వ్యక్తి ఓ హోటల్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, గత నెల రోడ్డు ప్రమాదంలో అతనికి కాలు విరగడంతో ఉపాధి కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న శివాజీ బ్లడ్ గ్రూప్ సభ్యులు అల్లాడి దేవా, అడ్లురి నరేష్, దేవేందర్ గౌడ్ (కన్ను) బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. అదనంగా, వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ అనుబంధాన్ని చూసి నసీర్ ఖాన్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. సేవా కార్యక్రమాల్లో ముందుండే శివాజీ బ్లడ్ గ్రూప్ సభ్యులు, సామాజిక సేవలో తమ సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
నిజామాబాద్
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేసిన ఎంఎల్ఏ.


కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేసిన ఎంఎల్ఏ.
జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మా క్లూర్,నందిపేట మండలాలలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శుక్రవారం ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి పంపిణి చేశాడు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి మాట్లాడాడు. మండల కేంద్రమైన నందిపేటలో అక్రమంగా మొరంను తరలిస్తున్న మొరం బండ్లను పోలీసులు చూసి చూడనట్లు స్పెషల్ పోలీస్ దాడి చేసి మొరం బండ్లను పట్టుకోవడం జరిగిందని, అక్రమ వ్యాపారం చేసే వారు ఎం తటి వారినైనా సరే సహించేది లేదని ఆయన అన్నాడు. ప్రభుత్వ అనుమతులను పొందిన వారే గోదావరి నుండి నల్ల మట్టి తరలించాలని, నల్ల మట్టి వాసనలు ఓవర్ స్పీడుతో వెల్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపాడు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బిజెపి అధ్యక్షుడు పటేల్ రాజు, కంఠం సర్పంచు సాయి, మాజి ఎంపిటి సి సభ్యుడు పేయింటర్ రాజు, లక్కంపల్లి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ


హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
జనంవెలుగు, నిజామాబాద్: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కృష్ణ మోహన్ నాయకత్వం వహించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ డా. తిరుపతి రావు, డా. కిషోర్ కుమార్, హీమోఫీలియా నోడల్ ఆఫీసర్ డా. పవన్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా ప్రజలకు హీమోఫీలియా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, ముందస్తు గుర్తింపు, సరైన నిర్ధారణ, తగిన చికిత్స ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని వైద్యులు వివరించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్య సేవలు పొందడం అత్యంత ముఖ్యమని, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
నిజామాబాద్
అసాంఘిక సంఘట నలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నిరసన.


అసాంఘిక సంఘట నలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నిరసన.
విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి దయానంద్.
జనం వెలుగు ఆర్మూర్: అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్ లు పోరాటాలు చేస్తొందని విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ అన్నాడు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ లు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించాడు.దేశ సామరస్యానికి భంగం కలిగించే వారికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఆయన తెలిపాడు. ముస్లిం జనాభా అధికంగా గల ప్రాంతాల లో నివసించే హిందు కుటుంబాలను వేధిస్తున్నారని ఆయన ఆవేద న వ్యక్తం చేశాడు.
మహారాష్ట్రలోని నాసిక్ టిసిఎస్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్ దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిందని, లవ్ జిహాదీ కుట్రలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని, అటవీ, రైల్వే, సైనిక తథితర ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమణలు చేస్తున్నవారిని దోషులుగా ప్రభుత్వానికి అప్పగిస్తామని ఆయన తెలిపాడు. ఈ కార్యక్రమంలో జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, జిల్లా ప్రచార ప్రముఖ్ బోచకర్ నిఖిల్, నగర ఉపాధ్యక్షుడు గంజాల ప్రేమ్, సహాయ కార్యదర్శి బోబిడే కరణ్, సురక్షా ప్రముఖ్ ప్రవీణ్, సహాయ సంయోజక్ అభిలాష్, సేవ ప్రముఖ్ శ్రీకాంత్, సప్తాహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, సలోపాసనా ప్రముఖ్ సాయి తదితరులు పాల్గొన్నారు.








