Connect with us

Crime

అనుమతుల పేరుతో ఇసుక అక్రమ దందా

suresh sitharla

Published

on

అనుమతుల పేరుతో ఇసుక అక్రమ దందా
ఒకే వే బిల్ తో రోజంతా ఇసుక దందా..

ఒకే బిల్‌పై రెండు ట్రాక్టర్ల నెంబర్లు – ప్రజల్లో ఆగ్రహం

– అధికారుల అండదండలు మెండుగా కనిపిస్తున్నాయి.

జనంవెలుగు, రుద్రూర్:- అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో బాన్సువాడ నియోజకవర్గంలో పట్టపగలు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఒక ట్రాక్టర్‌కు అనుమతి ఉండగా మూడు నుంచి నాలుగు వాహనాలతో ఒకే వేబిల్ తో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇసుక ట్రాక్టర్ లకు అనుమతి ఇవ్వడంతో దీనిని ఆసరా చేసుకుని ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. మంజీరా వాగు పోతంగల్ మండలం సుంకిని గ్రామం నుండి రుద్రూర్ మీదుగా వర్ని, చందూర్ వైపుకు అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. సీసీ రోడ్ల పనుల పేరిట వే బిల్లులు తీసుకొని రుద్రూర్ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఓ ఇంటి నిర్మాణానికి సుమారు 10 ట్రాక్టర్ ట్రిప్పుల డంపులు వేస్తున్నారు. ఇలా ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న కూడా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరేత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. సిసి రోడ్లు, ప్రభుత్వ పనుల పేరిట ప్రతిరోజు పదుల సంఖ్యలో జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

ఒకే బిల్‌పై రెండు ట్రాక్టర్ల నెంబర్లు – ప్రజల్లో ఆగ్రహం

 అధికారుల అండదండలతో అక్రమాలు వేగంగా జరుగుతున్నాయన్న అనుమానానికి మరోసారి బలమైన నిదర్శనంగా వే బిల్ వ్యవహారం మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వే బిల్లులో ఒకే బిల్లుపై రెండు ట్రాక్టర్ల నెంబర్లు నమోదవడం కలకలం రేపుతోంది. సాధారణంగా ఒక్కో వాహనానికి ప్రత్యేక వే బిల్ జారీ చేయడం ప్రామాణిక విధానం కాగా, ఇక్కడ రెండు వాహనాల సంఖ్యలు ఒకే బిల్లులో పొందుపర్చడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది యాదృచ్ఛికమా? లేక సజావుగా కొనసాగుతున్న అక్రమ వ్యవహారాల్లో భాగమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒక్కసారి జరిగినవే కాకుండా, ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయన్న అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా వే బిల్లుల పరంగా జరిగే అక్రమాలు రాష్ట్రానికి భారీ ఆదాయ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే సామాన్య ప్రజల దృష్టికి చేరింది. అందువల్ల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం నిలబెట్టాలంటే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఇంకా బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. నిజంగా న్యాయం జరిగేదెప్పుడని ఎదురు చూస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

janamvelugunews

Published

on

జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..

 కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.

 నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…

   కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని

  గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

Crime

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

janamvelugunews

Published

on

మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..

నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ

  శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Continue Reading

Crime

Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

janamvelugunews

Published

on

నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….

 స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు

 మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు

 నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

  హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.

  కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading