Crime
వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ న్యాయ పోరాటం – బాధితులకు భరోసా


వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ న్యాయ పోరాటం – బాధితులకు భరోసా
జనంవెలుగు, నిజామాబాద్: గ్రామ అభివృద్ధి కమిటీల (వి.డి.సి) పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఆధిపత్య కులాల నాయకులపై భారతీయ న్యాయవాదుల సంఘం (ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ – ఐ.ఎల్.పి.ఎ) న్యాయ పోరాటం ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్, జక్రాన్‌పల్లి గ్రామాల్లో జరిగిన నిజ నిర్ధారణ సమావేశంలో ఐ.ఎల్.పి.ఎ బృందం పాల్గొని బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా ఐ.ఎల్.పి.ఎ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్ మాట్లాడుతూ, వి.డి.సి ల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు న్యాయపరంగా, ప్రజాపరంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. చాకలి, ఎస్సీ కులాలకు చెందిన గ్రామస్తులు తమ భూములు బలవంతంగా లాక్కొని, వృత్తులను బహిష్కరించి, సమాజంలో వారిని వెలివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు గతంలో కమ్యూనిటీ హాల్ కూల్చివేయడంతో పాటు, ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా అణచివేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న ఐ.ఎల్.పి.ఎ నేతలు శాంసన్, వి.యం. కృష్ణారెడ్డి, సాయిని నరేందర్, అనంత ఆంజనేయులు గౌడ్, దయ్య రాజారామ్, సుమలత, కందుకాల సురేష్, వెంకటేష్ ప్రసాద్ తదితరులు వి.డి.సి ల అక్రమాలకు వ్యతిరేకంగా నిరంతర న్యాయ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. సమాజంలోని చిన్న కులాలపై జరుగుతున్న దౌర్జన్యాల్ని ఆపేందుకు సామాజిక, రాజకీయ, న్యాయ పోరాటం అవసరమని వారు పేర్కొన్నారు. వి.డి.సి లు గ్రామాల్లో అధికారాన్నే దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వ భూములు కబ్జా చేయడంలోనూ, లక్షలాది రూపాయలు వసూలు చేసి అజేయులుగా వ్యవహరిస్తున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చినా అమలుకావడం లేదని, పోలీసు వ్యవస్థ కూడా చేతులెత్తేసినట్టుగా ఉందని వాపోయారు. ప్రజలు ఐక్యంగా నిలిచినప్పుడే ఇటువంటి ఆధిపత్య శక్తులను కట్టడి చేయగలమని, గ్రామాల్లో ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయవాది జగడం రాజశేఖర్, రజక సంఘ నేతలు గూపన్ పల్లి శంకర్, జగడం సురేష్, నడికుడ శ్యామల, జగడం భాస్కర్, సుంకరి లింగం తదితరులు పాల్గొన్నారు.
Crime
జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..


జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..
కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.
నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని
గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
Crime
మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..


మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..
నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ
శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్‌కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Crime
Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….


నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….
స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు
మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు
నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.
హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.
కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.








