Crime
నాంపల్లి కోర్టుకు రేవంత్ హాజరు


నాంపల్లి కోర్టుకు రేవంత్ హాజరు
హైదరాబాద్, మే 22:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గతంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ఇవాళ హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ బేగంబజార్, నల్గొండ టూ టౌన్, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో వ్యక్తిగతంగా న్యాయమూర్తి ముందు హాజరైన రేవంత్ రెడ్డి తన వాదనను వినపించారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని కోర్టుకు తెలిపారు. తాను ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఈ కేసుల్లో జూన్ 12న నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది.ముఖ్యమంత్రి కోర్టుకు హాజరుకావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. ఈ కేసులు నమోదైన సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఏప్రిల్ 2024లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణ నిమిత్తం ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు హాజరుకావడం రెండోసారి. న్యాయమూర్తి వాంగ్మూలం రికార్డ్ చేసి తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం రేవంత్ కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గతంలో పరువు నష్టం దావా వేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఒక కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. కాసం వెంకటేశ్వర్లు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కాసం వెంకటేశ్వర్లు తన ఫిర్యాదుతో పాటు, రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించారు. రేవంత్ రెడ్డిపై ఈ కేసు నమోదైన సమయంలో ఆయన తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. రేవంత్ రెడ్డి తనపై నమోదైన ఈ పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినా.. ట్రయల్ కొనసాగింపును నిలిపివేయడానికి నిరాకరించింది.
Crime
జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..


జాలరి వల విసిరితేనే…. జానెడు పొట్టకు..జీవనం..
కాని తాను.. విసిరే వల.. తన మడకే చుట్టుకొని తననే కాటేస్తదనుకోలేదు ఆ గంగా పుత్రుడు. అటువంటి దురదృష్ట ఘటన ఒకటి డొంకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది.
నందిపేట్ సెప్టెంబర్ 30 జనం వెలుగు:- నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన మాడబోయి కట్ట గణేష్ (37) సోమవారం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతం గంగాసముందర్ గ్రామ శివారు గంగలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాద వశాత్తు వల చుట్టుకొని మరణించడం జరిగింది. స్థానిక ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
కట్ట గణేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేడు, మంగళవారం ఉదయం 7 గంటల 30 ని:కు గంగ సముందర్ గ్రామ శివారు గంగాలో శివమై తేలినాడని
గణేష్ భార్య కట్ట కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి కొడుకు యోగేష్, కూతురు హన్సిక కలరని ఆయన అన్నారు. గంగాపుత్రులకు వారి వలలే వారికి శాపంగా మారి తరచూ మృత్యువాత పడుతున్నారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యశాఖ తగు చర్యలు చేపట్టలని, ఆ వలల బారిన పడకుండా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
Crime
మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..


మోసం కేసులో లక్కంపల్లి సర్పంచ్ అరెస్ట్…..
నందిపేట్ సెప్టెంబర్ 19 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రూరల్ నార్త్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మణిక్ బండార్ గ్రామ
శివారులో గల గండ్ర రివర్ వ్యూ అనే రియల్ ఎస్టేట్ వెంచర్‌కు సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 8 కోట్ల వరకు లెక్కలు తారుమారు అయ్యాయని వెంచర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సంతోష్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
అయితే సంతోష్ గౌడ్ సర్పంచ్ కాకముందు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లో ఉద్యోగం చేసేవాడని యాజమాన్యానికి తెలియకుండా మరికొంత మంది వ్యక్తులతో కలిసి ప్లాట్లు లావాదేవీలు చేసే పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచాడేమోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఏది ఏమైనా గ్రామ ప్రథమ పౌరుడు సేవా దృక్పథం, తమ ప్రజలకు ఎవరైనా మోసం చేస్తే ముందు నిలబడే నాయకుడుగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి ప్రథమ పౌరుడు పైనే మోసం కేసు నమోదవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Crime
Big breaking news నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….


నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదులు….
స్వతంత్ర వేడుకలకు స్వాగతం పలుకుతూ… రోడ్డుపైనే సిరంజీ సూదులు
మండల కేంద్రం నంది విగ్రహం వద్ద రోడ్డుపై వందలాది సూదులు
నందిపేట్ ఆగస్టు 15 జనం వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద శనివారం ఉదయాన్నే నడిరోడ్డుపై వాడిన సిరంజీ సూదరులు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. నేడు స్వాతంత్ర వేడుకలు సందర్భంగా గ్రామపంచాయతీ వారు రాత్రి నుండే మండల కేంద్రం రోడ్లన్నీ శుభ్రపరిస్తే ఉదయాన్నే రోడ్డంతా ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడి ఉండడంతో పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.
హాస్పిటల్స్ లో ఉపయోగించే ఈ ఇంజక్షన్ల నీడిల్సు వాడిన తర్వాత బయో మెడికల్ వేస్టేజ్ బాక్స్ లో వేసి ఎంతో జాగ్రత్తగా డంపు యార్డుకు తరలించాల్సి ఉంటుంది. ఈ యూజుడ్ ఇంజక్షన్స్, నీడిల్స్ ద్వారా హెచ్ఐవి, హెపటైటీస్ బి/సి లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగే ప్రమాదం ఉంది.
కానీ మండల కేంద్రంలో మాత్రం విచ్చలవిడిగా పి ఎంపీ, ఆర్ఎంపీ ల పేరిట గల్లీకో దవఖాన పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కనీసం మెడికల్ నిబంధనలను కూడా పాటించకుండా ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం ఇటువంటి వారిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రతి హాస్పిటల్స్ లో బయో మెడికల్ వేస్టేజ్ బాక్సులు ఉండేటట్టు చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.








