నిజామాబాద్
యువతకు సెల్యూట్


యువతకు సెల్యూట్
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట డొంకేశ్వర మండలాలలో సోమవారం సాయంత్రం బారి ఈదురుగాలులు, వర్షంతో వరనుడు విరుచుకు పడ్డాడు. అర్ధగంట వ్యవదిలోనే రెండు మండలాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. నివాస గృహాలకు, వ్యాపార షాపుల కొరకు వేసుకున్న ఇనుప రేకుల షెడ్లన్నీ భారీ గాలికి తెల్లాచెదరయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం లేకున్నా రోడ్ల వెంబడి ఉన్న చెట్లన్ని విరిగి రోడ్డుపైన పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అయితే నేటి యువత మాత్రం ప్రకృతి వైపరీత్యాల సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. నిన్న జరిగిన గాలి దుమారానికి నందిపేట్ నుండి కుద్వాన్పూర్, నందిపేట్ నుండి తల్వెద, నందిపేట్ నుండి డొంకేశ్వర వైపు వెళ్లే రోడ్డు మార్గాలలో చెట్లన్ని విరిగిపడి ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. నందిపేట మండల కేంద్రం చెందిన వెల్మల్ ప్రవీణ్, మచ్చర్ల గ్రామానికి చెందిన దేవదాస్, మనోజ్, ఇండియన్ జవాన్ ఉపేంద్రాలు కారులో తొండాకూర్ నుండి నందిపేట్ వస్తుండగా రోడ్డుపై భారీ చెట్లు విరిగిపడడంతో రోడ్డు మార్గం మొత్తం స్తంభించిపోయింది, కరెంటు లేదు అటు ఇటు కార్లలో మహిళలు పిల్లలు చిక్కుకోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించి అతివేగంగా వీచే గాలులను లెక్కచేయకుండా, ఆ భారీ వర్షంలో ఆ నలుగురు యువకులు దాదాపు 7 8 ఎన్ని చెట్లను ట్రీ కట్టర్ యంత్రం సహాయంతో ముక్కలు చేసి రోడ్డునంత క్లియర్ చేశారు. అప్పటికప్పుడే స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ బాధ్యతగా ప్రకృతి వైపరీత్యాలలో పాలుపంచుకోవడం మండల ప్రజలను ఆకట్టుకుంది. దీంతో ఆ నలుగురు యువకులను ప్రజలు సోషల్ మీడియాలో హాట్సాఫ్ అంటూ అభినందిస్తున్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








