Connect with us

నిజామాబాద్

రజక కళ్యాణ మండప శిలాఫలకం ధ్వంసం

suresh sitharla

Published

on

పోలీసులకు ఫిర్యాదు చేసిన రజక సంఘం

జనంవెలుగు, నందిపేట:- నందిపేట మండల కేంద్రంలోని పల్గుట్ట శివారు ప్రాంతంలో రజక కళ్యాణ మండపం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. గురువారం ఈ ఘటనపై మండల రజక సంఘం సభ్యులు నందిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అనంతరం తహసీల్దార్‌కు మెమోరాండం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు కుంటాల గవాస్కర్ మాట్లాడుతూ “గత ప్రభుత్వం హయాంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మాజీ మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా రజక కళ్యాణ మండపం కోసం భూమి పూజ నిర్వహించాం. దాదాపు 1 ఎకరం భూమిని కేటాయిస్తూ రూ. 25 లక్షల అంచనా వ్యయంతో పథకం రూపొందించబడింది. మండల అధికారులు, టీఆర్‌ఎస్ శ్రేణుల సమక్షంలో శిలాఫలకం ఏర్పాటు చేశాం. అయితే ఇది రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం,” అని తెలిపారు. శిలాఫలక ధ్వంసం కేవలం ఒక చిన్న సంఘటన కాదని, ఇది రజక జాతిపై వివక్ష చూపే ఉద్దేశంతో జరిపిన చర్యగా భావిస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఇతర కులాలకు కళ్యాణ మండపాలు నిర్మించబడినప్పటికీ, ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న రజకుల కళ్యాణ మండప నిర్మాణం మాత్రం ఆలస్యం కావడం విచారకరమన్నారు. కేటాయించిన భూమిపై ఎవ్వరైనా కబ్జా ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. “మా రజక జాతిపై ఈర్ష ఎందుకు? మేము కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. అధికారులు వెంటనే శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. అలాగే మాకు కేటాయించిన భూమికి స్పష్టమైన హద్దులు చూపిస్తే, తక్షణమే నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం,” అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రజక సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading