నిజామాబాద్
త్రాగునీటి కలుషితంపై ప్రజల ఆందోళన


కమీషనర్ వెంటనే స్పందించాలంటూ డిమాండ్
జనంవెలుగు, నిజామాబాద్: వర్షాకాలం ప్రారంభమైన ఈ సమయంలో నగరంలోని పలు డివిజన్‌లలో త్రాగునీటి సరఫరాలో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. జోన్-3 లోని 52వ డివిజన్, బురుడ్ గల్లీ ప్రాంతాల్లో త్రాగునీటి కొళాయిల ద్వారా మురుగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మురుగు కాలువలు నిండిపోవడం, పైపుల లీకేజీలు పెరగడం వలన మురుగు నీరు త్రాగునీటి సరఫరాలో కలిసిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని గల్లీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం రాకపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు వాపోతున్నారు. ఇకనైనా మున్సిపల్ కమీషనర్ చర్యలు తీసుకోవాలని, మురుగు కాలువలను శుభ్రం చేయించి, లీకేజీలు నియంత్రించి, త్రాగునీటి శుద్ధి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 52వ డివిజన్ లోని పంప్ ఆపరేటర్ మురళి, లైన్మెన్ లింగం శుక్రవారం రోజు నీటి క్లోరినేషన్ స్థాయిని పరిశీలించినట్లు సమాచారం. అయినా, త్రాగునీటిలో సురక్షతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బురుడ్ గల్లీ వాసులు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








